ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు - వాతావరణశాఖ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. మరికొన్ని రోజులపాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల రెండు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం (18-10-2026)ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది..

ఇక తెలంగాణలో ఐదారు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. శనివారం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఇవాళ కూడా చాలా జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.

అక్టోబర్ 19 వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
అక్టోబర్ 19 నుంచి 21 వరకు చూస్తే…. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, పరిసర జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

అక్టోబర్ 21 నుంచి 24 వరకు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందకూడదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

E-Paper

