Telangana Weather : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - మరో 4 రోజులు వర్షాలు - వాతావరణశాఖ
Telangana Weather Update : తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఎండలు ఉండగా… మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుండగా … మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
(image istock)
గడిచిన నాలుగైదు రోజులుగా చాలా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరో నాలుగు రోజుల పాటు కూాడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబా నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏప్రిల్ 29వ తేదీన నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.
ఏప్రిల్ 30వ తేదీన సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబుబాబాద్,వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇవాళ(ఏప్రిల్ 28) హైదరాబాద్ లో చూస్తే సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చు. లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పంట పొలాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
E-Paper

