తెలంగాణలో పెరిగిన ఎండ తీవ్రత - అక్టోబర్ 2 నుంచి తేలికపాటి వర్షాలు
తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది.
తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలున్నాయి.
సెప్టెంబర్ 30 ఉదయం నుంచి అక్టోబర్ 2 ఉదయం వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్పప్పటికీ, అక్టోబర్ 2 నుంచి మళ్లీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గడిచిన రెండు రోజులుగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉక్కపోత కూడా తీవ్రంగానే ఉంటోంది.
వర్షాలు, ఉరుములు ఉండే సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
E-Paper

