IND vs NZ : వీళ్లు రిటైర్మెంట్కి దగ్గర్లో ఉన్నారంటే ఎవరూ నమ్మరు! ఫీల్డింగ్‌లో ఇచ్చిపడేసిన రోహిత్- కోహ్లీ
భారత క్రికెట్ జట్టు లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మైదానంలోకి అడుగుపెడుతూనే ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేశారు! న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వీరిద్దరు ఫీల్డింగ్‌లో అదరగొట్టి “ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్” అని మరోసారి నిరూపించారు.

ఆక్లాండ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్. బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగి విజృంభించడంతో న్యూజిలాండ్ జట్టు 40.2 ఓవర్లకు 185కి ఆలౌట్ అయ్యింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుకుంటోంది.

39ఏళ్ల రోహిత్ శర్మ.. కళ్లు చెదిరే రనౌట్ చేశాడు. బాల్ పట్టి డైవ్ చేస్తూ మరీ, డేంజరెస్ డారిల్ మిచెల్‌ని పెవీలియన్‌కి పంపాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కరు 97/5.

ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో అంశుల్ కాంబోజ్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని ఆడేందుకు కివీస్ బ్యాటర్ నాథన్ స్మిత్ ప్రయత్నించాడు. అప్పుడు స్లిప్‌లో నిలబడిన కోహ్లీ.. నేలను తాకుతూ దూసుకొచ్చిన బంతిని ఎడమవైపు అత్యంత అద్భుతమైన డైవ్‌తో ఒడిసిపట్టుకున్నాడు. క్యాచ్ పట్టిన వెంటనే నవ్వుతూ బాణం వేస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. ఈ పండుగ వాతావరణంలో కోహ్లీ చేసిన ఈ సరదా సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కోహ్లీ రేపు 38 వయస్సులోకి అడుగుపెడతాడు.

న్యూజిలాండ్‌తో టీమిండియా మొత్తం 5 వన్డేలను అడుతుంది. 50ఓవర్ గేమ్ మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లీని చూసేందుకు ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులు ఎగబడుతున్నారు.

E-Paper

