అమ్మాయిలు అదుర్స్-వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భార‌త్‌-స్మృతి, ప్ర‌తీక సెంచ‌రీల మోత‌-10 ఫొటోల్లో మ్యాచ్‌

Published on Oct 24, 2025 10:15 am IST

టీమిండియా వుమెన్స్ టీమ్ అదరగొట్టింది. డూ ఆర్ డై మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీతో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో సత్తాచాటారు. ఈ 10 ఫొటోల్లో మ్యాచ్ వివరాలు చూసేయండి.

1 / 10
<p>తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధించింది. ఫలితంగా 2025 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న నాలుగో జట్టుగా నిలిచింది. </p>(AFP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధించింది. ఫలితంగా 2025 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న నాలుగో జట్టుగా నిలిచింది.

(AFP)

2 / 10
ప్రతీక రావల్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పింది. 134 బంతుల్లో 122 పరుగులు చేసింది. ఇది ఆమెకు రెండో వన్డే శతకం కాగా, ప్రపంచకప్‌లో తొలి సెంచరీ. చివరకు అమేలియా కెర్ బౌలింగ్‌లో ఆమె తన వికెట్‌ను కోల్పోయింది. (Raju Shinde) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

ప్రతీక రావల్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పింది. 134 బంతుల్లో 122 పరుగులు చేసింది. ఇది ఆమెకు రెండో వన్డే శతకం కాగా, ప్రపంచకప్‌లో తొలి సెంచరీ. చివరకు అమేలియా కెర్ బౌలింగ్‌లో ఆమె తన వికెట్‌ను కోల్పోయింది. (Raju Shinde)

3 / 10
స్మృతి మంధాన 2025 మహిళల ప్రపంచకప్ ఎడిషన్‌లో తన తొలి సెంచరీని నమోదు చేసింది. 95 బంతుల్లో 109 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఇది ఈ ఏడాది ఆమెకు ఐదో సెంచరీ కాగా, మొత్తంగా 14వ శతకం. మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన జాబితాలో సుజీ బేట్స్‌ను అధిగమించి రెండో స్థానంలో నిలిచింది. (Raju Shinde) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

స్మృతి మంధాన 2025 మహిళల ప్రపంచకప్ ఎడిషన్‌లో తన తొలి సెంచరీని నమోదు చేసింది. 95 బంతుల్లో 109 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఇది ఈ ఏడాది ఆమెకు ఐదో సెంచరీ కాగా, మొత్తంగా 14వ శతకం. మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన జాబితాలో సుజీ బేట్స్‌ను అధిగమించి రెండో స్థానంలో నిలిచింది. (Raju Shinde)

4 / 10
స్మృతి మంధాన, ప్రతీక రావల్ న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల వన్డేల్లో ఈ జోడీ 200 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది రెండోసారి. (PTI) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

స్మృతి మంధాన, ప్రతీక రావల్ న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల వన్డేల్లో ఈ జోడీ 200 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది రెండోసారి. (PTI)

5 / 10
<p>గత గేమ్‌కు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ న్యూజిలాండ్‌పై నెం.3 స్థానంలో ప్రమోషన్ పొందింది. 55 బంతుల్లో 76 పరుగులు చేసి అంచనాలను నిలబెట్టుకుంది. </p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

గత గేమ్‌కు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ న్యూజిలాండ్‌పై నెం.3 స్థానంలో ప్రమోషన్ పొందింది. 55 బంతుల్లో 76 పరుగులు చేసి అంచనాలను నిలబెట్టుకుంది.

(PTI)

6 / 10
<p>భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 49 ఓవర్లు ఆడిన ఇండియా 340/3 స్కోరు చేసింది. డీఎల్ఎస్ ప్రకారం కివీస్ టార్గెట్ ను 44 ఓవర్లలో 325గా డిసైడ్ చేశారు. </p>(Raju Shinde) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 49 ఓవర్లు ఆడిన ఇండియా 340/3 స్కోరు చేసింది. డీఎల్ఎస్ ప్రకారం కివీస్ టార్గెట్ ను 44 ఓవర్లలో 325గా డిసైడ్ చేశారు.

(Raju Shinde)

7 / 10
44 ఓవర్లలో 325 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో రేణుకా సింగ్ ఠాకూర్ భారత్‌కు శుభారంభం అందించింది. ఆమె వరుసగా జార్జియా ప్లిమ్మర్, సోఫీ డివైన్‌లను ఔట్ చేసి కివీస్‌ను దెబ్బతీసింది. (PTI) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

44 ఓవర్లలో 325 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో రేణుకా సింగ్ ఠాకూర్ భారత్‌కు శుభారంభం అందించింది. ఆమె వరుసగా జార్జియా ప్లిమ్మర్, సోఫీ డివైన్‌లను ఔట్ చేసి కివీస్‌ను దెబ్బతీసింది. (PTI)

8 / 10
<p>స్నేహ్ రాణా కీలకమైన అమేలియా కెర్ వికెట్‌ను పడగొట్టింది. 53 బంతుల్లో 45 పరుగులు చేసిన కెర్ పెవిలియన్‌కు చేరింది. </p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

స్నేహ్ రాణా కీలకమైన అమేలియా కెర్ వికెట్‌ను పడగొట్టింది. 53 బంతుల్లో 45 పరుగులు చేసిన కెర్ పెవిలియన్‌కు చేరింది.

(AP)

9 / 10
న్యూజిలాండ్ తరఫున బ్రూక్ హాలిడే ఒంటరి పోరాటం చేసింది. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 81 పరుగులు చేసింది. చివరకు ఇన్నింగ్స్ 39వ ఓవర్లో శ్రీ చరణి బౌలింగ్‌లో ఔటైంది. (AFP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

న్యూజిలాండ్ తరఫున బ్రూక్ హాలిడే ఒంటరి పోరాటం చేసింది. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 81 పరుగులు చేసింది. చివరకు ఇన్నింగ్స్ 39వ ఓవర్లో శ్రీ చరణి బౌలింగ్‌లో ఔటైంది. (AFP)

10 / 10
న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో విజయం సాధించి, మహిళల ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న తర్వాత సంబరాలు చేసుకుంటున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. (PTI) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 10:15 am IST

న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో విజయం సాధించి, మహిళల ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న తర్వాత సంబరాలు చేసుకుంటున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. (PTI)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!