India Vs Newzealand: టీమిండియాకు బిగ్ షాక్.. ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ డకౌట్.. ఏం జరిగిందంటే?
India Vs Newzealand: న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ సొంతం చేసుకొని, వన్డే సిరీస్ నూ వరుసగా రెండు విజయాలతో మొదలెట్టిన టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కివీస్ తో నాలుగో వన్డేలో ఛేజింగ్ లో పేసర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫస్ట్ ఓవర్లోనే ఏకంగా మూడు వికెట్లు పడ్డాయి.

న్యూజిలాండ్ తో నాలుగో వన్డేలో ఛేజింగ్ లో ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యారు.

ఛేజింగ్ లో పిచ్ నుంచి లభిస్తున్న స్వింగ్ తో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే రోహిత్ శర్మను ఔట్ చేశాడు.
(AFP)
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కోహ్లి 3 బాల్స్ డిఫెండ్ చేశాడు. కానీ నాలుగో బాల్ కు బౌల్డయ్యాడు. లోపలికి స్వింగ్ అయిన బాల్ బ్యాట్ పక్క నుంచి వెళ్లి స్టంప్స్ ను లేపేసింది.
(AFP)
ఆ నెక్ట్స్ బాల్ కే శ్రేయస్ అయ్యర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇన్ స్వింగర్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఫస్ట్ ఓవర్ లో ఒక్క రన్ కూడా చేయని ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రుతురాజ్ ను జెమీసన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం
(AFP)
అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ చెలరేగింది. విల్ యంగ్ (125) సెంచరీతో రెచ్చిపోవడంతో కివీస్ 50 ఓవర్లలో 333 రన్స్ కు ఆలౌటైంది.
(AFP)
E-Paper

