Independence day : ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు- ఫొటోలు..
దేశ రాజధాని దిల్లీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వరుసగా 13వసారి.. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూడండి..
80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో శనివారం ఉదయం దిల్లీ ఎర్రకోటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
(PTI)
ఈ చారిత్రక వేడుకలకు వివిధ రంగాల నుంచి సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు! మహిళా పారిశ్రామికవేత్తలు, యువ ఆవిష్కర్తలు, రైతులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ముద్రా యోజన లబ్ధిదారులు, అంతర్జాతీయ యోగా దినోత్సవ స్వచ్ఛంద సేవాకులు, స్వచ్ఛ భారత్ సిబ్బంది, ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన మెట్రో కార్మికులు, కర్తవ్య పథ్ కార్మికులు ఎర్రకోట వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
(AFP)
భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ భవిష్యత్తును మార్చే దిశగా ‘సప్తధార’ పేరిట సరికొత్త సంస్కరణల ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించారు. ప్రాచీన కాలంలో 'సప్త సింధు' ఏ విధంగా దేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందో గుర్తుచేసిన ప్రధాని, ఇప్పుడు వికసిత్ భారత్ నిర్మాణానికి అదే తరహాలో 'సప్తధార' శక్తి అవసరమని పేర్కొన్నారు.
(PTI)
సాయుధ నక్సలిజం అంతరించిపోయినప్పటికీ, సమాజంలో 'దిమాగి నక్సల్స్' రూపంలో కొత్త ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని గుర్తించి సమాజం నుంచి వేరుచేయాలని, దేశ భద్రత, పురోగతి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే.. దిమాగి నక్సల్స్ అంటే ఏంటి? దిమాగి నక్సల్స్ అంటే ఎవరు? అన్న ప్రశ్నలకు మోదీ స్పష్టత ఇవ్వలేదు.
(PTI)
80వ స్వాతంత్య్ర వేడుకల కోసం మోదీ.. రాజస్థానీ, గుజరాత్ సంప్రదాయాన్ని తలపించే ఎరుపు రంగు టై-అండ్-డై తలపాగను ధరించారు. తెల్లటి కుర్తా, చాక్లెట్ బ్రౌన్ వెస్ట్ సహా త్రివర్ణ పతాక రంగులను పోలిన మూడు పాకెట్ స్క్వేర్లను ఆయన ధరించారు.
(PTI)
E-Paper

