International Yoga Day 2026 : వృద్ధాప్యంలోనూ యవ్వనంగా ఉండాలా? యోగా చేయాల్సిందే మరి!

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నేపథ్యంలో "యోగా ఫర్​ హెల్తీ యేజింగ్" అనే అంశంపై నిపుణులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. యోగా అనేది కేవలం కఠినమైన ఆసనాలు వేయడం కాదు, మనస్సును ప్రశాంతంగా ఉంచే జీవన విధానం అని స్పష్టం చేస్తున్నారు.

Published on: Jun 20, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని “యోగా ఫర్​ హెల్తీ యేజింగ్” అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా.. వయసు పైబడుతున్న కొద్దీ మానసిక, శారీరక సమతుల్యతను కాపాడుకోవడంలో యోగా ఎంతగా ఉపయోగపడుతుందో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రముఖ యోగా గురువు, ఆర్‌ఏఏ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాధికా అయ్యర్ తలాటి ఈ విషయాలపై పలు కీలక సూచనలు చేశారు. వయస్సు పెరిగే కొద్ది ఆరోగ్యంగా ఉండటం అంటే అడ్వాన్స్‌డ్ ఆసనాలు వేయడం కాదని, కాలక్రమేణా శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచే మంచి అలవాట్లను పెంపొందించుకోవడమేనని ఆమె స్పష్టం చేశారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 20, 2026 11:18 AM

2/6

యోగా అనగానే చాలా మంది కేవలం శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు తిప్పడం, ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడం లేదా బాహ్య సౌందర్యం కోసమేనని తప్పుగా అనుకుంటారని రాధికా పేర్కొన్నారు. యోగా వల్ల శారీరక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అది మాత్రమే దాని ప్రధాన లక్ష్యం కాదన్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ముఖంలో గ్లో రావడం, చర్మం మెరిసిపోవడం లేదా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారడం వంటివి కేవలం అదనపు ప్రయోజనాలు (బై-ప్రొడక్ట్స్) మాత్రమేనని రాధికా అయ్యర్ వివరించారు. యోగా అసలైన, లోతైన ఉద్దేశం మానసిక స్పష్టతను, భావోద్వేగ సమతుల్యతను, అంతర్గత శాంతిని సాధించడమేనని స్పష్టం చేశారు.

3/6

సమయం లేదనే నెపంతో యోగాకు దూరంగా ఉండే వారి కోసం రాధికా తలాటి ఒక సులువైన మార్గాన్ని సూచించారు. యోగా ప్రారంభించడానికి అనుకూలమైన పరిస్థితులు వచ్చే వరకు వేచి చూడకుండా, చిన్న చిన్న అడుగులతోనే మొదలుపెట్టాలని ఆమె కోరారు. యోగా అంటే కేవలం గంటల తరబడి ఆసనాలు వేయడమే కాదని, కాసేపు ప్రశాంతంగా కూర్చుని మనల్ని మనం గమనించుకోవడంతో కూడా దీనిని ప్రారంభించవచ్చని ఆమె చెప్పారు. అయితే, నేరుగా కఠినమైన యోగా నియమాల్లోకి వెళ్లేముందు.. నడక, రన్నింగ్ లేదా ఈత వంటి శారీరక శ్రమల ద్వారా శరీరానికి కనీస ఫిట్‌నెస్ అలవాటు చేయాలని, ఆ తర్వాత క్రమబద్ధమైన యోగా రొటీన్‌ను ప్రారంభించాలని ఆమె కొత్త వారికి సూచిస్తుంటారు.

4/6

యోగా నేర్చుకోవడం ప్రారంభించిన కొత్తలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు.. కొన్ని రోజుల్లోనే ఫలితాలు వచ్చేయాలని ఆశించడం అని రాధికా తలాటి అభిప్రాయపడ్డారు. అలా కాకుండా యోగాను జీవితకాల సాధనగా భావించాలని ఆమె సూచించారు. మొదటి కొన్ని నెలల పాటు అర్హత కలిగిన యోగా గురువు పర్యవేక్షణలోనే ఆసనాలను నేర్చుకోవాలని, ఆ తర్వాతే సొంతంగా ప్రాక్టీస్ చేయాలని బిగినర్స్‌కు సూచిస్తున్నారు. అలాగే మన సాధనను మరింత మెరుగుపరుచుకోవడానికి అప్పుడప్పుడు యోగా నిపుణులను కలిసి సలహాలు తీసుకోవడం మంచిదన్నారు.

5/6

నిత్యం యోగా, ధ్యానం చేయడం వల్ల ఆందోళన, డిప్రెషన్, ఆఫీస్ ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడు ఎలాంటి సవాళ్లనైనా స్పష్టమైన ఆలోచనలతో, సమతుల్యతతో ఎదుర్కొనే శక్తి లభిస్తుందన్నారు.

6/6

గత కొన్ని దశాబ్దాలుగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున గుర్తింపు రావడానికి కారణం.. ప్రజలు దీనిని కేవలం ఒక వ్యాయామ రూపంగా కాకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి మార్గంగా గుర్తించడమేనని రాధికా తలాటి విశ్లేషించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా వయస్సు పెరిగే కొద్ది ఆరోగ్యంగా ఉండటంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న తరుణంలో.. జీవితాంతం తోడుండేలా క్రమం తప్పకుండా యోగా అలవాటు చేసుకోవడంపైనే ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సంవత్సరం యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలనుకునే వారికి ఆమె ఇచ్చిన సలహా చాలా సింపుల్: “మీకు సాధ్యమైనంత చిన్న స్థాయిలోనే ప్రారంభించండి, కానీ ప్రతిరోజూ నిలకడగా చేయండి. యోగా ఇచ్చే అద్భుతమైన ఫలితాలు కాలక్రమేణా మీ జీవితంలో చూస్తారు.”

Related Photos