IPL 2026 : ఎక్కువసార్లు ట్రోఫీ గెలిచిన జట్లు.. ఇప్పుడు టేబుల్ బాటమ్ ర్యాంక్ కోసం పోటీ!
IPL 2026 points table : ఐపీఎల్ 2026లో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి! ఐపీఎల్ ట్రోఫీ కోసం గట్టి ఫైట్ ఇచ్చే జట్లు, ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానం కోసం పోటీపడుతున్నాయి. ఆదివారం ఎంఐ- ఆర్సీబీ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఆడిన 4 మ్యాచుల్లో 4 విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో (8పాయింట్స్) ఉంది. అంతేకాదు, 10 జట్లల్లో ఆర్‌ఆర్‌కే మెరుగైన రన్ రేట్ ఉంది. ఇక రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టు (7 పాయింట్లు) ఉంది. ఇవాళ ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే 9 పాయింట్లతో పంజాబ్ మొదటి స్థానానికి చేరుకుంటుంది.
ఆదివారం ముంబై ఇండియన్స్‌పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు ఐపీఎల్ పాయింట్ల్ టేబుల్లో 3వ స్థానంలో ఉంది (6 పాయింట్లు). ఈ జట్టు ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలిచి, ఒకటి ఓడిపోయింది. ఇక దిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది.
ఆదివారం మధ్యాహ్నం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో గుజరాత్ టైటాన్స్ 4 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. జీటీపై ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ 6వ స్థానంలో (4 పాయింట్లు) కొనసాగుతోంది. జీటీ కన్నా లక్నో రన్ రెట్ తక్కువగా ఉంది.
ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో సన రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక్కటే మ్యాచ్ గెలిచి, 2 పాయింట్లతో 7వ పొజిషన్లో ఉంది. ఈరోజు అతి బలమైన రాజస్థాన్ రాయల్స్‌పై గెలిస్తే, 4 పాయింట్లతో ఈ జట్టు 5వ స్థానానికి, భారీ విజయం అందుకుంటే 4వ స్థానానికి వెళ్లొచ్చు. ఎందుకంటే.. జీటీ, లక్నోకి ఎస్ఆర్హెచ్ కన్నా తక్కువ రన్ రేట్ ఉంది. దిల్లీకి ఎస్ఆర్హెచ్ కన్నా స్వల్పంగా ఎక్కువ రన్ రేట్ ఉంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్లు సీఎస్కే, ఎంఐ, కేకేఆర్. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలో 5సార్లు కప్ కొట్టాయి. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ 3సార్లు ట్రోఫీని దక్కించుకుంది. కానీ ఈ ఐపీఎల్ 2026లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది!
ఇప్పటివరకు 4 మ్యాచులు ఆడిన ఎంఐ కేవలం 1 విజయంతో 8వ స్థానంలో ఉంది. సీఎస్కే కూడా ఆడిన 4 మ్యాచుల్లో ఒక్కటే గెలుపుతో 9వ స్థానంలో ఉంది. సీఎస్కే కన్నా ఎంఐకి రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఇక కేకేఆర్ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. 4 మ్యాచుల్లో 3 ఓడిపోయింది. పంజాబ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడంతో ఈ జట్టుకు 1 పాయింట్ లభించింది.
E-Paper

