Praful Hinge : వైభవ్​ సూర్యవంశీ డకౌట్​.. ఒకే ఓవర్​లో 3 వికెట్లు- ఎవరు ఈ ప్రఫుల్​ హింజ్?

SRH vs RR : రాజస్థాన్​ రాయల్స్​ మ్యాచ్​లో సైన్​రైజర్స్​ హైదరాబాద్​ యంగ్​ సెన్సేషన్ ప్రఫుల్​ హింజ్ విజృంభించాడు. విధ్వంసకర వైభవ్​ సూర్యవంశీని డకౌట్​ చేయడమే కాకుండా, మొదటి ఓవర్​లోనే 3 వికెట్లు తీసి ఎస్​ఆర్​హెచ్​ గెలుపును ఖాయం చేశాడు. ఇంతకి ఎవరు ఈ ప్రఫుల్​ హింజ్?

Published on: Apr 14, 2026 6:00 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ప్రఫుల్​ హింజ్.. రెండో బంతికే వైభవ్ సూర్యవంశీని పెవిలియన్ పంపాడు. ఇక నాలుగో బంతికి ధ్రువ్ జురెల్, ఆఖరి బంతికి లువాన్ డ్రే ప్రిటోరియస్‌ను అవుట్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఐపీఎల్​ 2026 టేబుల్​ టాపర్​గా దూసుకెళుతున్న ఆర్​ఆర్​కి గట్టి షాకిచ్చాడు.
(HT_PRINT)expand-iconView Photos in a new improved layout
Published on Apr 14, 2026 6:00 AM

రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ప్రఫుల్​ హింజ్.. రెండో బంతికే వైభవ్ సూర్యవంశీని పెవిలియన్ పంపాడు. ఇక నాలుగో బంతికి ధ్రువ్ జురెల్, ఆఖరి బంతికి లువాన్ డ్రే ప్రిటోరియస్‌ను అవుట్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఐపీఎల్​ 2026 టేబుల్​ టాపర్​గా దూసుకెళుతున్న ఆర్​ఆర్​కి గట్టి షాకిచ్చాడు.

(HT_PRINT)

2/5

ఈ పేస్ సంచలనం ఇక్కడితో ఆగిపోలేదు! తన రెండో ఓవర్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను కూడా ఔట్​ చేసి తన ఖాతాలో నాలుగో వికెట్ వేసుకున్నాడు. మొత్తం మీద 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. దీనితో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ కుర్రాడి వైపు చూస్తోంది. ఎవరు ఈ ప్రఫుల్​ హింజ్​ అని అందరు తెగ వెతికేస్తున్నారు.
(AP)expand-iconView Photos in a new improved layout

(AP)

3/5

24 ఏళ్ల ప్రఫుల్ హింజ్ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన రైట్ ఆర్మ్ సీమర్. దేశవాళీ క్రికెట్‌లో ముఖ్యంగా రెడ్ బాల్ (ఫస్ట్ క్లాస్) ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు ఆడిన 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టి, నిలకడైన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. కేవలం రూ. 30 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ అతడిని సొంతం చేసుకుంది. టీ20 అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, తన లైన్ అండ్ లెంగ్త్‌తో విధ్వంసకర బ్యాటర్లను సైతం కట్టడి చేయగలనని నిరూపించాడు.

4/5

"ప్రఫుల్ హింజ్ ఒక కష్టపడే మనస్తత్వం ఉన్న బౌలర్. విదర్భ తరపున ఉమేష్ యాదవ్‌తో కలిసి బౌలింగ్ పంచుకున్న అనుభవం అతనికి ఉంది. కేవలం బ్యాకప్ బౌలర్‌గా జట్టులోకి వచ్చినప్పటికీ, అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు," అని ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ బౌలింగ్ విభాగం ధారాళంగా పరుగులు ఇస్తూ విమర్శలపాలైంది. ఈ క్రమంలో ప్రఫుల్ హింజ్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 14, 2026 6:00 AM

"ప్రఫుల్ హింజ్ ఒక కష్టపడే మనస్తత్వం ఉన్న బౌలర్. విదర్భ తరపున ఉమేష్ యాదవ్‌తో కలిసి బౌలింగ్ పంచుకున్న అనుభవం అతనికి ఉంది. కేవలం బ్యాకప్ బౌలర్‌గా జట్టులోకి వచ్చినప్పటికీ, అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు," అని ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ బౌలింగ్ విభాగం ధారాళంగా పరుగులు ఇస్తూ విమర్శలపాలైంది. ఈ క్రమంలో ప్రఫుల్ హింజ్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

(PTI)

5/5

ఇక ఉప్పల్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​ ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఇచ్చిన 217 పరుగుల టార్గెట్​ని ఆర్​ఆర్​ ఛేదించలేకపోయింది. కేవలం 159కే ఆలౌట్​ అయిపోయింది. తాజా గెలుపుతో ఎస్​ఆర్​హెచ్​ ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో 4వ స్థానికి (4 పాయింట్లు) ఎగబాకింది. నెట్​ రన్​రేట్​ కూడా బాగా మెరుగుపడింది. ఈ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కి ఇది రెండో గెలుపు.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 14, 2026 6:00 AM

ఇక ఉప్పల్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​ ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఇచ్చిన 217 పరుగుల టార్గెట్​ని ఆర్​ఆర్​ ఛేదించలేకపోయింది. కేవలం 159కే ఆలౌట్​ అయిపోయింది. తాజా గెలుపుతో ఎస్​ఆర్​హెచ్​ ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో 4వ స్థానికి (4 పాయింట్లు) ఎగబాకింది. నెట్​ రన్​రేట్​ కూడా బాగా మెరుగుపడింది. ఈ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కి ఇది రెండో గెలుపు.

(ANI Pic Service)

Related Photos