Vaibhav Sooryavanshi : 15ఏళ్ల వైభవ్​ సూర్యవంశీకి రూ.10కోట్ల నెట్​ వర్త్​! ముంబైలో ఖరీదైన ఇల్లు..

Vaibhav Sooryavanshi IPL : క్రికెట్​ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్క ప్లేయర్​ గురించే మాట్లాడుకుంటోంది! అతనే.. వైభవ్​ సూర్యవంశీ. ఐపీఎల్​ 2026 ఎలిమినేటర్​లో ఎస్​ఆర్​హెచ్​ బౌలర్లను ఈ 15ఏళ్ల బుడ్డోడు ఉతికారేసిన విధానానికి అందరు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో వైభవ్​ నెట్​ వర్త్​పై కొన్ని వార్తలు బయటకొచ్చాయి.

Published on: May 28, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గతంలో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆర్) వైభవ్​ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు దక్కించుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, గడిచిన ఏడాది కాలంలో అతను చూపించిన ఆటతీరుతో అతని బ్రాండ్ వాల్యూ, ఆస్తుల విలువ ఊహించని రేంజ్‌కు చేరుకుంది. అండర్-19 వరల్డ్ కప్ ప్రదర్శనలు, లగ్జరీ ఇళ్లు, బహుమతిగా వచ్చిన కార్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ ప్రస్తుతం రూ. 10 కోట్లను దాటినట్లు అంచనా.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on May 28, 2026 11:18 AM

గతంలో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆర్) వైభవ్​ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు దక్కించుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, గడిచిన ఏడాది కాలంలో అతను చూపించిన ఆటతీరుతో అతని బ్రాండ్ వాల్యూ, ఆస్తుల విలువ ఊహించని రేంజ్‌కు చేరుకుంది. అండర్-19 వరల్డ్ కప్ ప్రదర్శనలు, లగ్జరీ ఇళ్లు, బహుమతిగా వచ్చిన కార్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ ప్రస్తుతం రూ. 10 కోట్లను దాటినట్లు అంచనా.

(REUTERS)

2/5

చిన్న వయసులోనే అద్భుత రికార్డులు సృష్టిస్తున్న వైభవ్‌కు పలు అవార్డులు, ఖరీదైన గిఫ్టులు వచ్చాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో అత్యధిక స్ట్రైక్-రేట్‌తో ఇన్నింగ్స్ ముగించినందుకు గాను అతనికి రూ. 17 లక్షల విలువైన ఈ ఎలక్ట్రిక్ కారు బహుమతిగా లభించింది. గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం.. వైభవ్ ప్రతిభను మెచ్చి రంజిత్ బర్తకూర్ అనే రచయిత ఒక లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు గాను ఫిబ్రవరి 2026లో అప్పటి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైభవ్‌ను రూ. 50 లక్షల నగదు పురస్కారంతో సత్కరించారు.
(AP Photo/Ashwini Bhatia)expand-iconView Photos in a new improved layout

(AP Photo/Ashwini Bhatia)

3/5

మీడియా నివేదికల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీకి సొంతంగా రెండు ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ముంబైలోని ఒక అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో వైభవ్‌కు ఒక సొంత ఫ్లాట్ ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తాజ్‌పూర్ పరిధిలో ఉన్న అతని పాత నివాసం విలువ సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఉంటుందని అంచనా.

4/5

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్‌కు ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతనికి ఏటా రూ. 1.1 కోట్ల ధరను ఫిక్స్ చేసింది. లీగ్‌లో ఇది అతనికి రెండవ ఏడాది. ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్ ఆడినందుకు ఆటగాళ్లకు ఇచ్చే రూ. 7.5 లక్షల మ్యాచ్ ఫీజు కింద.. వైభవ్ ఇప్పటివరకు తన కెరీర్‌లో 22 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెక్కన కేవలం మ్యాచ్ ఫీజుల రూపంలోనే అతను రూ. 1.65 కోట్లు సంపాదించాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout

(PTI)

5/5

ఐపీఎల్ సంపాదన, నగదు బహుమతులు, ఆస్తుల విలువ మాత్రమే లెక్కిస్తే వైభవ్ నెట్ వర్త్ రూ. 7 కోట్లుగా తేలుతుంది. అయితే, ప్రస్తుతం అతనికున్న క్రేజ్ దృష్ట్యా పలు దిగ్గజ కంపెనీలు అతనితో ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ స్పాన్సర్‌షిప్ బ్రాండ్ వాల్యూను కూడా కలిపితే అతని మొత్తం నెట్ వర్త్ రూ. 10 కోట్లను దాటేస్తుందని మీడియా కథనాలు చెబుతున్నాయి.

Related Photos