Shirdi Tour Package : హైదరాబాద్ టు షిర్డీ ట్రిప్ - బడ్జెట్ ధరలో 3 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
IRCTC Hyderabad Shirdi Tour Package : ఈ వేసవి వేళ షిర్డీ ట్రిప్ ప్లాన్ వెళ్లే ఆలోచన చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. జర్నీ తేదీలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
ఈ వేసవి వేళ షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
(image source @SSSTShirdi )
ఈ ప్యాకేజీ మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీని “సాయి సన్నిధి EX హైదరాబాద్ ”పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 8 ఏప్రిల్, 2026 తేదీన అందుబాటులో ఉంది.
2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఆసక్తి గల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు బుకింగ్ చేసుకునే వాళ్లు… కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.
ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం…సింగిల్ షేరింగ్ కు రూ.7920గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6700,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6690గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5000, డబుల్ షేరింగ్ కు రూ. 5010, సింగిల్ షేరింగ్ కు రూ. 6230గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరే భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించాలి.
E-Paper

