ఒకే ట్రిప్ లో అరకు, సింహాచలం చూసి రావొచ్చు - ఈ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

అందమైన అరకు అందాలను వీక్షించేందుకు సరికొత్త ప్యాకేజీ వచ్చేసింది. విశాఖపట్నం నుంచి ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అరకుతో పాటు సింహాచలం కూడా చూడొచ్చు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Nov 5, 2025 1:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా అరకు వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. కేవలం అరకు మాత్రమే కాకుండా సింహాచలం కూడా చూడొచ్చు.

expand-iconView Photos in a new improved layout
Published on Nov 5, 2025 1:03 PM

2/6

'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ 10 నవంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

3/6

మొదటి రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పహారం తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.

4/6

రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరాలి. దారిలో తైడా జంగల్ బెల్స్ చూస్తారు. పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. 3వ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.

5/6

ప్యాకేజీ ధరలు :  ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9280, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ12,105, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.22,530గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలుంటాయి.  5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

6/6

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు లేదా వివరాలు తెలుసుకునేందుకు 8287932318, 9281495847,9550166168 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

Related Photos