బాడీ మంచి షేప్​లో ఉండాలంటే.. వాకింగ్​ ఒక్కటే సరిపోతుందా?

వ్యాయామాల్లో అత్యంత సులభమైనది, ఖర్చు లేనిది 'నడక'! భారతీయ కుటుంబాల్లో భోజనం తర్వాత నడవడం ఒక అలవాటు. అయితే, కేవలం నడకతోనే పూర్తి ఆరోగ్యం లభిస్తుందా? బాడీ మంచి షేప్​లో ఉంటుందా? దీనిపై ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్న ఆసక్తికర వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: Feb 22, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సీనియర్ ఫిట్‌నెస్ మాస్టర్ ట్రైనర్ మితుషి అజ్మీరా ప్రకారం.. నడక అనేది శరీరానికి ఒక కదలిక మాత్రమే, దానిని పూర్తి వ్యాయామంగా పరిగణించలేము. ఏం చేయకుండా కూర్చోవడం కంటే నడవడం ఎంతో మేలు. ఇది రక్త ప్రసరణకు, కీళ్లకు, మానసిక ఉల్లాసానికి మంచిదే. కానీ “వాడకపోతే తుప్పు పడుతుంది” అనే సామెత ప్రకారం, శరీరానికి కొత్త సవాళ్లు ఇవ్వకపోతే అది మొద్దుబారిపోతుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Feb 22, 2026 11:20 AM

2/5

నడక ఎవరికి సరిపోతుంది? ఎక్సర్‌సైజ్ సైంటిస్ట్ అసద్ హుస్సేన్ ప్రకారం,, ఇప్పుడిప్పుడే వ్యాయామం మొదలుపెట్టిన వారికి నడక మంచిది. వయసు పైబడిన వారు కఠిన వ్యాయామాలు చేయలేరు కాబట్టి వారికి నడక ఉత్తమం. అనారోగ్యం లేదా గాయం నుంచి కోలుకుంటున్న వారికి నడక ఒక రీసెట్ లా పనిచేస్తుంది. అలాగే రక్తపోటును తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి, ఒత్తిడిని దూరం చేయడానికి బ్రిస్క్​ వాకింగ్​ ఎంతో మేలు చేస్తుంది.

3/5

అయితే, మార్కెట్​లో షికారు చేసినట్టు మెల్లగా నడవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు! నిపుణులు ఒక చిన్న పరీక్ష చెబుతున్నారు: మీరు నడుస్తున్నప్పుడు ఎదుటివారితో మాట్లాడగలగాలి, కానీ పాట పాడలేనంత వేగంగా ఉండాలి. దీనిని 'మోడరేట్ ఇంటెన్సిటీ' అంటారు. గంటకు సుమారు 5 కిలోమీటర్ల వేగంతో నడవాలి. వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు చురుగ్గా నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైగా నడిచేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండాలి, భుజాలు రిలాక్స్‌గా ఉండాలి.

4/5

నడక వల్ల కండరాల బలం లేదా ఎముకల సాంద్రత పెరగదు. వయసు పెరిగే కొద్దీ కండరాల క్షీణత మొదలవుతుంది. నడక ఒక్కటే దీనిని ఆపలేదు. కాబట్టి దీనిని స్ట్రెంత్ ట్రైనింగ్​కు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. కండరాలు మీ శరీరంలోని మెటబాలిక్ ఇంజిన్ల వంటివి. వాటికి సవాలు విసరకపోతే (బరువులు ఎత్తడం వంటివి) కాలక్రమేణా అవి బలహీనపడతాయి, కండరాలు దృఢంగా ఉండాలన్నా, ఎముకలు గట్టిపడాలన్నా వారానికి 2 నుంతి 4 సార్లు వెయిట్ ట్రైనింగ్ లేదా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం తప్పనిసరి.

5/5

మీ లక్ష్యం కేవలం యాక్టివ్‌గా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవడం అయితే బ్రిస్క్​ వాకింగ్​ సరిపోతుంది. కానీ, మీరు కండరాలు పెంచుకోవాలి, ఎముకలు బలంగా ఉండాలి, వృద్ధాప్యంలోనూ చురుగ్గా ఉండాలి అనుకుంటే మాత్రం నడకతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

Related Photos