Weight loss : వెయిట్​ లాస్​ వల్ల బలహీనపడిపోతున్నారా? కారణం ఇదే- అసలు ముప్పు ఏంటంటే..

చాలా మంది కేవలం బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే క్రాష్ డయట్స్ వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోయే ప్రమాదం ఉందని గుర్తించరు. ఇది నీరసం, డయాబెటిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Jun 18, 2026 11:28 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఆరోగ్యంగా ఉండాలనో, ఫిట్‌నెస్ సాధించాలనో అనుకునే వారిలో ఎక్కువ మంది ఎంచుకునే ఏకైక లక్ష్యం ‘బరువు తగ్గడం’. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, వైద్యపరమైన ఇబ్బందులు వస్తాయనేది ఎంత నిజమో.. కేవలం బరువు తగ్గడం మాత్రమే పూర్తి ఫిట్‌నెస్ కాదనేది కూడా అంతే నిజం. ఒకవేళ మీరు బరువు తగ్గుతూ, అదే సమయంలో మునుపటి కంటే ఎక్కువ నీరసంగా, అలసటగా లేదా శక్తి తగ్గినట్లు అనిపిస్తే.. అది మీ శరీరం ఇస్తున్న ప్రమాద సంకేతంగా భావించాలి. మనం కేవలం బరువు తగ్గడం అనే అంశంపైనే అమితంగా దృష్టి పెట్టినప్పుడు, కొవ్వుతో పాటు శరీరంలోని కండరాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది శరీరంలో సరికొత్త సమస్యలకు దారి తీస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 18, 2026 11:28 AM

2/6

శరీర జీవక్రియల ఆరోగ్యం, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండటానికి కండరాల నష్టాన్ని అరికట్టడం అత్యంత ముఖ్యమైన అంశమని డాక్టర్ తయాల్ చెబుతున్నారు. జీవక్రియ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, మొత్తం శారీరక పనితీరుతో సహా అనేక ప్రధాన శారీరక విధులకు కండరాలే కీలక బాధ్యత వహిస్తాయని ఆయన వివరించారు. అందుకే కేవలం బరువు తగ్గడం కంటే, శరీర ఆకృతి, కంపోజిషన్​పై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. అంటే, కండరాలు దెబ్బతినకుండా కేవలం కొవ్వును మాత్రమే సురక్షితమైన పద్ధతిలో తగ్గించుకోవాలి. చాలా సార్లు బరువు త్వరగా తగ్గాలనే ఆరాటంతో తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వల్ల బరువు కొలిచే మిషన్‌పై నంబర్లు తగ్గొచ్చు కానీ, లోపల కండరాలు కరిగిపోతాయి. ఇది శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

3/6

సాధారణంగా బరువు తగ్గినప్పుడు వేయింగ్ మిషన్‌లో నంబర్లు తగ్గడం లేదా బట్టలు లూజ్ అవ్వడం వంటి మార్పులను మనం సులభంగా గమనించవచ్చు. కానీ కండరాలు తగ్గుతున్నప్పుడు శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా చాలా మార్పులు జరుగుతాయి. మీ శక్తి స్థాయిలు పడిపోతాయి, బలం తగ్గుతుంది, రోజువారీ చిన్న చిన్న పనులు చేయడం కూడా మునుపటి కంటే చాలా అలసటగా అనిపిస్తుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఒక వ్యక్తి బాహ్యంగా చూసేందుకు సరైన బరువుతో సాధారణంగానే కనిపించినప్పటికీ, వారి శరీరంలో తగినంత మజిల్ మాస్ లేకపోతే వారు కూడా మెటబాలిక్ రిస్క్ జోన్‌లో ఉన్నట్లేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

4/6

బరువును నియంత్రణలో ఉంచడానికి కండరాలు ఎంతలా ఉపయోగపడతాయో తెలుసా? శరీరంలో కండరాలు తగ్గినప్పుడు, బాడీ క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇది మీ జీవక్రియ వేగాన్ని మందగించేలా చేస్తుంది, ఫలితంగా కాలక్రమేణా శరీరంలో కొవ్వు చాలా సులభంగా పెరిగిపోతుంది.

5/6

కండరాల నష్టాన్ని ఎలా నివారించాలి?- బరువు తగ్గే ప్రక్రియలో కండరాలు కరిగిపోవాలనే నియమమేమీ లేదు. క్రాష్ డయట్స్ వంటి ప్రమాదకరమైన, తాత్కాలిక బరువు తగ్గే పద్ధతులకు దూరంగా ఉండటమే ఇందుకు ప్రధాన మార్గం. సరైన వ్యాయామంతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

6/6

“క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, రెసిస్టెన్స్ వ్యాయామాలు (కండరాలకు బలాన్నిచ్చేవి) చేయడం, తగినంత ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవడం, నాణ్యమైన నిద్ర, చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా కండరాలు క్షీణించకుండా కాపాడుకోవచ్చు,” అని డాక్టర్ తయాల్ ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.

Related Photos