Child health : మీ పిల్లలు ఎప్పుడూ నీరసంగానే ఉంటున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

పిల్లల నీరసాన్ని చూసి బద్ధకమనో, హోంవర్క్ ఎక్కువైందనో తేలికగా కొట్టిపారేస్తుంటారు. కానీ నిరంతర అలసట వెనుక తీవ్ర ఆరోగ్య కారణాలు దాగి ఉండే ప్రమాదం ఉంది! పిల్లల్లో ఎనర్జీ తగ్గడానికి దారితీస్తున్న కారణాలను పూణెలోని మదర్‌హుడ్ హాస్పిటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రశాంత్ లక్ష్మణరావు రామ్‌టెక్కర్ వెల్లడించారు

Published on: Nov 13, 2026 11:28 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

బడికి వెళ్లే పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదలకు నాణ్యమైన నిద్ర అత్యవసరం. రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండటం, నిద్రవేళల్లో క్రమశిక్షణ లేకపోవడం పగటిపూట తీవ్ర అలసటకు దారితీస్తుంది. రాత్రి వేళల్లో గంటల తరబడి టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు చూడటం వల్ల పిల్లల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఫలితంగా మరుసటి రోజు ఉదయం నుంచే వారు ఉత్సాహం కోల్పోయి నీరసంగా కనిపిస్తారు.

Published on Nov 13, 2026 11:28 AM

2/6

ఉదయం బడికి వెళ్లే హడావుడిలో చాలామంది పిల్లలు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) సరిగ్గా తినకుండానే బయలుదేరుతున్నారు. రోజంతా చురుగ్గా ఉండటానికి అవసరమైన శక్తి ఉదయం తీసుకునే ఆహారం నుంచే లభిస్తుంది. ఆహారం చాలా తక్కువగా తీసుకోవడం లేదా ప్రోటీన్లు, ఐరన్, ఇతర కీలక పోషకాలు లేని ఆహారం తినడం వల్ల పిల్లల్లో శక్తి స్థాయిలు పడిపోతాయి. జంక్ ఫుడ్‌కు అలవాటు పడి పౌష్టికాహారానికి దూరమవ్వడం కూడా వారిని నిస్సత్తువలోకి నెడుతుంది.

3/6

నేటి తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆశిస్తున్నారు. దీనితో పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, ఆ తర్వాత ట్యూషన్లు, క్రీడలు, ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలా పరిమితికి మించి పనుల్లో మునిగిపోవడం వల్ల పిల్లలు శారీరకంగానే కాకుండా మానసికంగానూ పూర్తిగా అలసిపోతారు. శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోవడంతో వారిలో నీరసం శాశ్వతంగా తిష్ట వేస్తుంది.

4/6

పెద్దల తరహాలోనే పిల్లలు కూడా మానసిక ఒత్తిడికి గురవుతారు. చదువుల ఒత్తిడి, స్నేహితులతో గొడవలు, తోటి విద్యార్థుల వేధింపులు (బుల్లీయింగ్) లేదా ఇంట్లో చోటుచేసుకునే మార్పులు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తమ బాధను మాటల్లో చెప్పలేని పిల్లలు అలసట, చిరాకు లేదా అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలతో తమ ఒత్తిడిని బయటపెడతారు. అలాంటి సంకేతాలను తల్లిదండ్రులు గమనించి వెంటనే తగిన సహాయం అందించాలి. మరోవైపు తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు, రక్తహీనత (అనీమియా), థైరాయిడ్ సమస్యల వల్ల కూడా పిల్లలు విపరీతమైన అలసటకు గురవుతారు. ఇలాంటి పోషకాహార లోపాలు లేదా అనారోగ్య సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్నపిల్లల వైద్యుడితో (పీడియాట్రిషియన్) పరీక్షించాలి.

5/6

పిల్లల్లో అలసట కొన్ని వారాల పాటు కొనసాగుతూ, వారి చదువు, ఆటలపై ప్రభావం చూపుతుంటే తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నీరసంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరిగి పడిపోవడం, నిరంతర జ్వరం, విపరీతమైన బలహీనత లేదా గందరగోళంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.

6/6

Related Photos