విశాఖ - విజయవాడ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు... ఆగే స్టేషన్లు ఇవే
విశాఖపట్నం - విజయవాడ మార్గంలో జనసాధారణ్ (అన్రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు పలు స్టేషన్లలో ఆగుతాయి.

దసరా పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం - విజయవాడ - విశాఖపట్నం మధ్య జనసాధారణ్ (అన్రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు.

విశాఖపట్నం - విజయవాడ జనసాధారణ్ స్పెషల్ (రైలు నంబర్ 07717 ): ఈ రైలు అక్టోబర్ 17 (శనివారం) ఒక ట్రిప్ అందుబాటులో ఉంటుంది. శనివారం ఉదయం 09:40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి… అదే రోజు సాయంత్రం 16:00 (4:00 PM) గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

విజయవాడ - విశాఖపట్నం జనసాధారణ్ స్పెషల్ (రైలు నంబర్ 07718) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 అక్టోబర్ 19 (సోమవారం) అందుబాటులో ఉంటుంది. సోమవారం సాయంత్రం 17:30 (5:30 PM) గంటలకు విజయవాడలో బయలుదేరి, రాత్రి 23:50 (11:50 PM) గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది

విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు (07717) దువ్వాడ వద్ద ఉదయం 10:20/10:22 గంటలకు, అనకాపల్లి 10:38/10:40, తుని 11:20/11:22, సామర్లకోట 12:10/12:12, రాజమండ్రి 12:55/12:57, తాడేపల్లిగూడెం 13:35/13:37, ఏలూరు 14:06/14:08 గంటలకు ఆగుతూ సాయంత్రం 16:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
(image source @GMSRailway)
అలాగే విజయవాడ నుండి బయలుదేరే రైలు (07718) ఏలూరు వద్ద సాయంత్రం 18:23/18:25 గంటలకు, తాడేపల్లిగూడెం 19:03/19:05, రాజమండ్రి 20:05/20:10, సామర్లకోట 20:53/20:55, తుని 21:38/21:40, అనకాపల్లి 22:24/22:26, దువ్వాడ 23:10/23:12 గంటలకు ఆగుతూ రాత్రి 23:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ జనసాధారణ్ ప్రత్యేక రైలులో మొత్తం 11 ICF/CBC కోచ్లు ఉంటాయి. అందులో 9 జనరల్ (సాధారణ) కోచ్లు, 2 SLR (సిట్టింగ్ కమ్ లగేజ్) కోచ్లు అందుబాటులో ఉంటాయి.

ఇవన్నీ సాధారణ అన్రిజర్వ్డ్ కోచ్లు కావడంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ అవసరం లేకుండా కౌంటర్లలో సాధారణ టికెట్ కొనుగోలు చేసి నేరుగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

E-Paper

