OTT Trending: ఈ వారం జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ సినిమాలు, సిరీస్‌లు..బోల్డ్ మూవీస్ కూడా..రెండు 18+ వాళ్లకే..లుక్కేయండి
OTT Trending: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లో ట్రెండింగ్ సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్కేయండి. ఇందులో బోల్డ్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. సస్పెన్స్ తో థ్రిల్ పంచే చిత్రాలను కూడా చూడొచ్చు
ఈ వారం జియోహాట్‌స్టార్ టాప్ 6 సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇక్కడుంది. ఈ సినిమాలు, సిరీస్‌లకు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో 2 సినిమాలు 18+ వాళ్లకు మాత్రమే.
ధురంధర్ - రా అండ్ అన్ దేఖా: జియోహాట్‌స్టార్‌లో 'ధురంధర్ - రా అండ్ అన్ దేఖా' మూవీ అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ది అమెజింగ్ స్పైడర్ మాన్ - మీకు మార్వెల్ సూపర్‌హీరో సినిమాలు ఇష్టమైతే, ‘ది అమెజింగ్ స్పైడర్‌మాన్’ ఫస్ట్ పార్ట్ ను జియోహాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఇప్పుడీ మూవీ ట్రెండింగ్ లో అదరగొడుతోంది.
ది అమెజింగ్ స్పైడర్ మాన్ 2 - సెకండ్ పార్ట్ కూడా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ది అమెజింగ్ స్పైడర్ మాన్ 2 కూడా మంచి వ్యూయర్ షిప్ సాధిస్తోంది.
ఆస్క్ మీ వాట్ యూ వాంట్? - కొంచెం బోల్డ్, ఇంటెన్స్ మూవీ చూడాలనుకుంటే జియోహాట్‌స్టార్‌లోని ఆస్క్ మీ వాట్ యూ వాంట్ పై లుక్కేయండి. కానీ ఇది 18 ప్లస్ వాళ్లకు మాత్రమే.
హౌస్ ఆఫ్ డార్క్ నెస్ - ఓ బార్ లో ఓ అమ్మాయిని హీరో కలుస్తాడు. ఆ బ్యూటీఫుల్ లేడీని ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఆ తర్వాత ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ కూడా పెద్దవాళ్లకు మాత్రమే.
ఇన్ స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 - ఈ సిరీస్ మొదటి భాగం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇన్ స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 కూడా వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.
E-Paper

