Kavya Chef Mantra: బిగ్ బాస్ అనుకుంటే కుకింగ్ షోలోకి.. చెఫ్ మంత్రలో కావ్య.. క్రేజీ టీమ్స్.. ఓటీటీలో ఎప్పుడంటే?
Kavya Chef Mantra: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు సీరియల్ నటి కావ్య శ్రీ ఈ రియాలిటీ షోలోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ తీరా చూస్తూ కావ్య రాలేదు. ఆమె ఏమో ఇప్పుడు చెఫ్ మంత్ర అనే కుకింగ్ షో చేస్తోంది. దీని ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు చూసేయండి.
పాపులర్ సీరియల్ నటి కావ్య శ్రీ మరో షోతో ఓటీటీలో ఎంటర్ టైన్ చేయనుంది. ఆహా ఓటీటీలో ఈ చెఫ్ మంత్ర సీజన్ 6 స్ట్రీమింగ్ కానుంది.
(instagram-ahavideoin)
బిగ్ బాస్ 10లోకి కావ్య వెళ్తారనే ప్రచారం జరిగింది, కానీ ఆమె హౌస్ లో అడుగుపెట్టలేదు. ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6లో యాదమ్మ రాజుతో జతకట్టింది ఈ బ్యూటీ.
(instagram-ahavideoin)
అర్జున్ అంబటి, ఇమ్మాన్యుయేల్ కలిసి ఓ టీమ్ గా చెఫ్ మంత్ర సీజన్ 6లో ఎంటర్ టైన్ చేయనున్నారు.
(instagram-ahavideoin)
రియల్ లైఫ్ లవ్ జోడీ సోనియా, సిద్ధు కూడా ఈ సీజన్ లోకి వచ్చారు. వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ స్పెషల్ గా నిలవనుంది.
(instagram-ahavideoin)
అమర్ దీప్, సుప్రీత కలిసి మరోసారి ఆడియన్స్ ను అలరించనున్నారు. ఈ జోడీ ఎలాంటి వంటలు చేస్తుందో చూడాలి.
(instagram-ahavideoin)
సోషల్ మీడియాలో పాపులర్ అయిన తల్లీకొడుకుల టీమ్ ఆరా థింగ్స్ కూడా చెఫ్ మంత్రాలోకి అడుగుపెట్టింది.
(instagram-ahavideoin)
ఇక హాట్ బ్యూటీస్ విష్ణు ప్రియ, రీతు చౌదరి కలిసి ఓ టీమ్ గా ఏర్పడ్డారు. వంటతోనే కాదు అందంతోనూ ఆడియన్స్ ను వీళ్లు అలరించనున్నారు. ఈ చెఫ్ మంత్ర సీజన్ 6 ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
(instagram-ahavideoin)
E-Paper

