పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ - రూ.2.25 కోట్ల చెక్కు అందజేత

Published on Aug 09, 2026 07:00 pm IST

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. వారి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

1 / 6

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని వారి నివాసానికి స్వయంగా చేరుకున్న ఆయన, పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

expand-icon View Photos in a new improved layout
Published on Aug 09, 2026 07:00 pm IST

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని వారి నివాసానికి స్వయంగా చేరుకున్న ఆయన, పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

2 / 6

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఆయన అకాల మరణం పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
expand-icon View Photos in a new improved layout
Published on Aug 09, 2026 07:00 pm IST

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఆయన అకాల మరణం పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

3 / 6

గతంలో ప్రకటించిన విధంగానే మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం వారి పేరిట చెరొక కోటి రూపాయల చొప్పున మొత్తం రెండు కోట్ల రూపాయల చెక్కులను కేసీఆర్ అందజేశారు. దాంతో పాటు ఆయన తల్లికి రూ. 25 లక్షల చెక్కును స్వయంగా అందజేశారు.
expand-icon View Photos in a new improved layout
Published on Aug 09, 2026 07:00 pm IST

గతంలో ప్రకటించిన విధంగానే మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం వారి పేరిట చెరొక కోటి రూపాయల చొప్పున మొత్తం రెండు కోట్ల రూపాయల చెక్కులను కేసీఆర్ అందజేశారు. దాంతో పాటు ఆయన తల్లికి రూ. 25 లక్షల చెక్కును స్వయంగా అందజేశారు.

4 / 6

పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకుల కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. అధినేత రాకతో పెద్ది కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

expand-icon View Photos in a new improved layout
Published on Aug 09, 2026 07:00 pm IST

పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకుల కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. అధినేత రాకతో పెద్ది కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

5 / 6

కేసీఆర్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Aug 09, 2026 07:00 pm IST

కేసీఆర్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.

6 / 6

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించే క్రమంలో కేసీఆర్ కూడా భావోద్వేగానికి గురుయ్యారు.
expand-icon View Photos in a new improved layout
Published on Aug 09, 2026 07:00 pm IST

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించే క్రమంలో కేసీఆర్ కూడా భావోద్వేగానికి గురుయ్యారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!