కీర్తి సురేష్.. చీరపై బ్లేజర్.. దేశీ గ్లామర్.. శ్రీలీల కూడా ఫిదా.. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం మహానటి ఇలా..
కీర్తి సురేష్ తన నయా గ్లామర్ లుక్ లో మెరిసిపోయింది. చీరపై బ్లేజర్ వేసి దేశీ గ్లామర్ కు ఓ కొత్త టచ్ ఇచ్చింది. ఈ ఫొటోలు కూడా శ్రీలీల, రాశీ ఖన్నా, కృతి శెట్టిలాంటి వాళ్లు కూడా ఫిదా అయిపోయారంటే నమ్మగలరా?
అటు అభిమానులు కూడా కీర్తిని ఇలా బ్లాక్ శారీలో గ్లామర్ డోస్ పెంచడం చూసి షాక్ తింటున్నారు. సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటించిన ఉప్పు కప్పురంబు మూవీ నేరుగా ప్రైమ్ వీడియోలోకి రానున్న విషయం తెలిసిందే.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆమె నటించిన ఉప్పు కప్పురంబు మూవీ శుక్రవారం (జులై 4) నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. ముందు రోజు ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇలా వెరైటీ ఫొటోషూట్ చేసింది.
కీర్తి స్టన్నింగ్ లుక్ చూసి శ్రీలీల, కృతి శెట్టి, రాశి ఖన్నాలాంటి నటీమణులు కూడా ఫిదా అయిపోయారు. వీళ్లు ఫైర్ ఎమోజీలను కామెంట్స్ చేయడం విశేషం.
దేశీ గ్లామర్, గ్లో, మరికాస్త డ్రామాను అందిస్తోంది. ఉప్పు కప్పురంబు జులై 4 నుంచి అనే క్యాప్షన్ తో ఇటు కీర్తి, అటు ప్రైమ్ వీడియో ఈ ఫొటోలను షేర్ చేశారు.
కీర్తి సురేష్ తన గ్లామర్‌కు కొత్త హంగులు అద్దుతోంది. తాజాగా చీరపై ఇలా బ్లేజర్ వేసి ఆమె తన స్టన్నింగ్ అందాలను చూపిస్తోంది.
E-Paper

