‘గుండె' భద్రం స్వామి- శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు..

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేరళ ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పంబ నుంచి సన్నిధానం వరకు సాగే కఠినమైన కొండ మార్గంలో గుండెపోటు ముప్పును నివారించేందుకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 24, 2026 4:02 PM IST
google-icon
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

నవంబర్ 22న కేరళ ఆరోగ్య శాఖ విడుదల చేసిన అడ్వైజరీ ప్రకారం, గతంలో గుండె జబ్బులు ఉన్న భక్తులు యాత్ర ప్రారంభించే ముందే వైద్యులను సంప్రదించి ఫిట్‌నెస్ ధ్రువీకరణ పొందాలి. ఇటీవలే గుండెపోటుకు గురైనవారు, గుండె శస్త్రచికిత్స లేదా యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారు, గుండె వైఫల్యంతో బాధపడుతున్నవారు నిపుణుల అనుమతి లేకుండా కఠినమైన కొండ మార్గంలో నడవకూడదు. కేవలం గుండె రోగులే కాకుండా అన్ని వయసుల భక్తులు తమ శారీరక పరిమితులను అర్థం చేసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.
(X)
Published on Nov 24, 2026 4:02 PM

2/7

అవి.. మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (బీపీ) వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి; యాత్రకు సరిపడా మందులతో పాటు ప్రిస్క్రిప్షన్‌లను వెంట ఉంచుకోవాలి. ఇతరులతో పోటీపడి వేగంగా నడవకుండా, తమ శారీరక సామర్థ్యానికి తగ్గ వేగంతోనే కొండ ఎక్కాలి. మధ్యమధ్యలో తగినంత విశ్రాంతి తీసుకుంటూ అధిక శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. వైద్యులు ద్రవ పదార్థాలు తగ్గించాలని చెబితే తప్ప, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవాలి. ఖాళీ కడుపుతో అస్సలు కొండ ఎక్కడం ప్రారంభించవద్దు. రద్దీగా ఉండే మార్గాల్లో పరుగెత్తడం లేదా తోసుకోవడం లాంటివి చేయకూడదు. సాధారణ భక్తులకు ఇచ్చే నీరు ఎక్కువగా తాగాలన్న సూచనను గుండె వైఫల్యం సమస్య ఉన్నవారు గుడ్డిగా పాటించవద్దని, తమ వైద్యులు సూచించిన పరిమితి మేరకే ద్రవాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది.

3/7

కొండ ఎక్కేటప్పుడు కలిగే అసౌకర్యాన్ని సాధారణ అలసటగా కొట్టిపారేయకుండా, గుండెపోటు ముందస్తు హెచ్చరికలను తక్షణమే గుర్తించాలని ఆరోగ్య శాఖ నొక్కిచెప్పింది. పలు లక్షణాలు కనిపిస్తే అది గుండె సంబంధిత అత్యవసర పరిస్థితికి సంకేతం కావొచ్చు. అవి.. ఛాతీలో నొప్పి, బరువుగా అనిపించడం, బిగుతుగా పట్టేసినట్లు ఉండటం లేదా అసౌకర్యం కలగడం. శారీరక శ్రమకు సంబంధం లేకుండా అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన ఆయాసం రావడం. శరీరమంతా విపరీతంగా చెమటలు పట్టడం. తలతిరగడం లేదా కళ్లు తిరిగి పడిపోవడం. గుండె వేగంలో అసాధారణ మార్పులు రావడం లేదా దడగా అనిపించడం. హఠాత్తుగా తీవ్రమైన అలసట, నీరసం ఆవహించడం. నొప్పి చేతులు, దవడ లేదా వీపు భాగంలోకి పాకడం.

4/7

ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా భక్తులు తక్షణమే నడక ఆపేసి, సురక్షిత ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవాలి; సమీపంలోని అత్యవసర వైద్య కేంద్రాన్ని సంప్రదించాలి. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందన్న అపోహతో కొండ ఎక్కే ప్రయత్నం అస్సలు చేయవద్దు. అత్యవసర వైద్య సహాయం కోసం భక్తులు శబరిమల ఆరోగ్య సేవల హెల్ప్‌లైన్ నంబర్ 04735 203232 కు కాల్ చేయవచ్చు. అవసరమైతే రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలి.

5/7

పంబ నుంచి సన్నిధానం వరకు సాగే యాత్రలో నిటారైన ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుడు దారులు ఉంటాయి; ఇందులో నీలిమల-అప్పాచిమేడు మార్గం అత్యంత కఠినమైనది. ఇలాంటి కఠిన శ్రమ సమయంలో కండరాలకు ఆక్సిజన్ అందించడానికి గుండె వేగంగా రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి, గుండె కండరాలకు ఆక్సిజన్ అవసరం అధికమవుతుంది.

ఇప్పటికే రక్తనాళాలు పూడుకుపోయిన (కరోనరీ ఆర్టరీ డిసీజ్) వ్యక్తులలో, ఆకస్మిక శ్రమ వల్ల గుండె కండరాలకు తగినంత రక్తం అందక 'మయోకార్డియల్ ఇస్కీమియా' తలెత్తుతుంది; ఇది కొన్నిసార్లు తీవ్ర గుండెపోటుకు దారితీస్తుంది. కొందరిలో గుండె లయ తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. బయటపడని అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువ. వయసు పైబడటం, శారీరక దారుఢ్యం లేకపోవడం దీనికి తోడవుతాయి. రోజువారీ సాధారణ పనులు సులభంగా చేయగలిగినంత మాత్రాన, నిటారైన కొండలను సుదీర్ఘంగా ఎక్కడానికి శరీరం వైద్యపరంగా సిద్ధంగా ఉందని భావించకూడదు.

6/7

భక్తులకు మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు 2026-27 యాత్రా సీజన్ కోసం కేరళ ప్రభుత్వం వైద్య మౌలిక సదుపాయాలను భారీగా బలోపేతం చేసింది. కేరళ సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, యాత్రా మార్గాల పొడవునా 24 గంటలూ పనిచేసే 22 అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, ప్రథమ చికిత్స, బేసిక్ లైఫ్ సపోర్ట్‌తో పాటు ఆక్సిజన్ స్థాయిలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించే సదుపాయాలు ఉన్నాయి.

7/7

దీనికి అదనంగా ప్రభుత్వం.. నిలక్కల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో కలిపి 63 ఆసుపత్రి పడకలు, 14 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసింది. నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో ప్రత్యేక కార్డియాలజీ వైద్య సదుపాయాలను పెంచింది. సాధారణ అంబులెన్సులతో పాటు 108, అడ్వాన్స్‌డ్ లైఫ్-సపోర్ట్ అంబులెన్స్ సేవలను సిద్ధం చేసింది. కఠినమైన కొండ మార్గాల కోసం ఆఫ్-రోడ్ అంబులెన్సులు, మొబైల్ మెడికల్ యూనిట్లను పెట్టింది. మెరుగైన చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ సహా సమీప ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Related Photos