TG Indiramma Houses : హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అప్డేట్ - ఈనెల 27 నుంచి లాటరీ, ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

Telangana Indiramma Housing Scheme Updates : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఫ్లాట్ల కేటాయింపులకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 27 నుంచి 30 వరకు లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని హౌసింగ్ బోర్డు తెలిపింది.

Published on: Aug 20, 2026 12:41 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) క్యూర్‌ పరిధిలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం తీపి కబురుందించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియకు హౌసింగ్ బోర్డు సర్వం సిద్ధం చేసింది.

expand-iconView Photos in a new improved layout
Published on Aug 20, 2026 12:41 PM

2/7

లబ్ధిదారులకు పారదర్శకంగా ఫ్లాట్లను కేటాయించేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి లాటరీ (లక్కీ డిప్) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలంగాణ గృహనిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) వైస్ ఛైర్మన్ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు.

3/7

ఈ డ్రా ప్రక్రియను ఏదో ఒక్క రోజుతో ముగించకుండా, ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించి 30వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం డిప్ ప్రక్రియ కొనసాగుతుంది.

4/7

"మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నిర్మిస్తున్న 7,340 ఇళ్లకు సంబంధించి దరఖాస్తుదారుల నుంచి భారీగా స్పందన వచ్చింది. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి తుది జాబితాను సిద్ధం చేశాం" అని గౌతమ్ పేర్కొన్నారు.

5/7

దరఖాస్తుదారుల సౌకర్యార్థం అర్హులైన వారి వివరాలతో కూడిన తుది జాబితాను గురువారం నుంచే అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. లబ్ధిదారులు ts.meeseva.telangana.gov.in, tghb.cgg.gov.in, tghb.telangana.gov.in పోర్టల్స్ ద్వారా తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు:

6/7

జాబితాలో పేర్లకు సంబంధించి లేదా అర్హతలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తుదారులు ఈ నెల 23వ తేదీ సాయంత్రం లోగా అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యంతరాలను పరిశీలించి, సవరించిన అనంతరం లాటరీ ప్రక్రియలో పాల్గొనే తుది దరఖాస్తుదారుల వివరాలను ఈ నెల 25న పూర్తిస్థాయిలో ప్రకటిస్తారు.

7/7

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, వెబ్‌సైట్ వివరాలు లేదా లక్కీ డిప్‌కు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 040-24603572 ల్యాండ్‌లైన్ నంబర్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చని అధికారులు సూచించారు.

Related Photos