Kiara Advani: టాక్సిక్‌లో బోల్డ్ సీన్ కాంట్రవర్సీ.. అసలు నా భర్త పట్టించుకోలేదు.. అదే హార్ట్ బ్రేక్: కియారా అద్వానీ
Kiara Advani: టాక్సిక్ సినిమాలో బోల్డ్ సీన్స్, ఆ మూవీ రిజల్ట్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సంచలన కామెంట్స్ చేసింది. ఆ బోల్డ్ క్యారెక్టర్ గురించి విమర్శలు వచ్చాయని, కానీ తన భర్త సిద్ధార్థ్ అసలు పట్టించుకోలేదని కియారా చెప్పింది.

బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 9 షోకు అటెండ్ అయ్యారు. ఈ షోలో తమ పర్సనల్, మూవీ ముచ్చట్లను ఈ జంట పంచుకుంది.
(instagram)
కాఫీ విత్ కరణ్ షోలో టాక్సిక్ మూవీలో యాక్ట్ చేయడం, బోల్డ్ సీన్లు, ఆ మూవీ రిజల్ట్ గురించి కియారా సంచలన కామెంట్లు చేసింది.

టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ బోల్డ్ సీన్లపై విమర్శలు వచ్చాయి. కానీ అసలు ఆ విషయాన్ని తన భర్త సిద్ధార్థ్ పట్టించుకోలేదని, తాము అసలు డిస్కషన్ కూడా చేయలేదని కియారా వెల్లడించింది.
(instagram-KIARA)
అయితే టాక్సిక్ మూవీ రిజల్ట్ మాత్రం తనను బాధించిందని కియారా పేర్కొంది. టాక్సిక్ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్ వచ్చిందని ఆమె చెప్పింది. కానీ ఆ తర్వాత మూవీ ఆడిన తీరు హార్ట్ బ్రేక్ కలిగించిందని కియారా తెలిపింది.
(instagram-KIARA)
కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్, సిద్ధార్థ్, కియారా దంపతులు తమ రెండో బేబీ కోసం ఎదురు చూస్తున్నారు.
(instagram-KIARA)
E-Paper

