రోహిత్ కాదు కెప్టెన్ కేఎల్ రాహుల్-రెండేళ్ల తర్వాత రుతురాజ్‌కు ఛాన్స్-బుమ్రాకు రెస్ట్-సౌతాఫ్రికాతో వన్డేలకు టీమిండియా
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియాను సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. మెడ గాయం కారణంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ సిరీస్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో కేెఎల్ రాహుల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు.
టీమిండియా వన్డే కెప్టెన్ గా కేెఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో టీమ్ ను రాహుల్ నడిపించనున్నాడు. ఇప్పటికే 12 వన్డేల్లో కెప్టెన్ గా చేసిన అనుభవం అతనికుంది. అయితే శుభ్ మన్ దూరమవడంతో మళ్లీ రోహిత్ కే ఈ సిరీస్ కోసం వన్డే పగ్గాలు అప్పగిస్తారనే వార్తలొచ్చాయి. కానీ కేఎల్ రాహుల్ కే కెప్టెన్సీ అప్పగించారు.
(AFP)
రెండేళ్ల తర్వాత రుతురాజ్ గైక్వాడ్ తిరిగి భారత వన్డే టీమ్ లోకి వచ్చాడు. దేశవాళీ, ఇండియా-ఎ టీమ్ తరపున అదరగొట్టిన అతను తిరిగి ప్లేస్ పట్టేశాడు. అక్షర్ ప్లేస్ లో జడ్డూ ఎంపికయ్యాడు.
(PTI)
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ సౌతాఫ్రికాతో మ్యాచ్ లకు దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30న స్టార్ట్ అవుతుంది.
(AFP)
వరుసగా టెస్టులు ఆడుతున్న బుమ్రాతో పాటు సిరాజ్ కు సౌతాఫ్రికా వన్డే సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు. ఈ ఇద్దరు పేసర్లను సెలక్ట్ చేయలేదు. మరోవైపు పంత్ తిరిగి టీమ్ లోకి వచ్చాడు.
(PTI)
టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లి ఈ టీమ్ లో ఉన్నారు. టీమ్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్) (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
(REUTERS)
E-Paper

