ఫొటోలు : మేడారంలో జనసంద్రం - ఇవాళ గద్దెపైకి సమ్మక్క

అత్యంత వైభవంగా మేడారం జాతర కొనసాగుతోంది. సారలమ్మ రాకతో జాతర ప్రాంగణమంతా కూడా జనసంద్రంగా ఉంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క అమ్మవారు గద్దె పైకి రానున్నారు. జంపన్న వాగు పుష్కారాలను తలపిస్తోంది.

Published on: Jan 29, 2026 3:34 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

ములుగు జిల్లాలోని మేడారం భక్తజన జాతరగా మారింది. లక్షలాదిగా తరలివచ్చినభక్తులతో వనదేవతల ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది.తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర,ఏపీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు,భక్తులు మేడారానికి తరలివచ్చారు. దీంతోమేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 29, 2026 3:34 PM

2/7

వెంట తెచ్చుకున్న కోళ్లను వనదేవతల గద్దెల సమీపంలో గాల్లోకి ఎగురవేస్తూ భక్తులు సందడి చేస్తున్నారు.కుటుంబాలను చల్లగా దీవించు తల్లీ అంటూ దేవతలను కొలుస్తున్నారు. ఎత్తు బంగారాలను సమర్పిస్తున్నారు. వచ్చే రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలిరానున్నారు. మేడారం వెళ్లే దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు,దొరల కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి వాతావరణం భక్తులను భక్తి పారవశ్యంలోముంచెత్తుతోంది. విదేశాల నుంచి కూడామానవ శాస్త్ర పరిశోధకులు ఈ అరుదైన గిరిజన సంస్కృతిని అధ్యయనం చేయడానికివిచ్చేస్తున్నారు.

3/7

ప్పటికే సారలమ్మ అమ్మవారు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వచ్చారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని గత నెల రోజుల నుంచే భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేసింది. అడవి తల్లుల ఆశీస్సుల కోసం..లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం అడవి పులకించిపోతోంది. ఆధునిక కాలంలోనూ ఆదివాసీ సంప్రదాయాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో చాటిచెప్పే ఈజాతర, కేవలం ఒక పండుగ మాత్రమేకాదు.. అది కోట్లాది మంది నమ్మకం. మేడారంలో ఎక్కడ చూసినా బెల్లం (బంగారం)..కుప్పలే కనిపిస్తున్నాయి. భక్తులు తమ కోరికలు తీరినందుకు కృతజ్ఞతగా తల్లులకు'బంగారం' సమర్పించుకుంటున్నారు

4/7

గిరిజన ఆచారం ప్రకారం వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నజంపన్న వాగు ఇప్పుడు భక్తుల స్నానాలతో జన సముద్రాన్ని తలపిస్తోంది. వాగులోస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనిభక్తుల ప్రగాఢ విశ్వాసం. జంపన్న వాగు పుష్కరశోభను తలపిస్తున్నది. కాగా గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా అత్యాధునిక సెన్సార్ల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. 50కి పైగా మొబైల్ మెడికల్ యూనిట్లు, ఎమర్జెన్సీ కోసంఎయిర్ అంబులెన్స్ సౌకర్యం సిద్ధంగా ఉన్నాయి.

5/7

భక్తుల కోసం ప్రత్యేకంగా 'మేడారం యాప్' అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా పార్కింగ్ ప్లేసులు, ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర  స్వయంగా జాతర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 42,000 మంది ప్రభుత్వ సిబ్బందిని విధుల్లో ఉన్నారు.  భక్తులు ప్రశాంతంగా వనదేవతలను దర్శించుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

6/7

భక్తుల రద్దీతో విద్యుత్ వెలుగులతో , రాత్రి వేళ అద్భుతమైన దృశ్యంతో మేడారం మెరిసిపోతున్నది. చిన్న చిన్న వాగుల ఒడ్డున, చెట్లకింద వేలాది మంది భక్తులు వంటలు చేసుకుంటూ, చిన్న చిన్న దీపాల వెలుగులో ఆనందంతో కుటుంబ సభ్యులతో సేద తీరుతూ ఈ పర్యటనను మధిలో నిలుపుకుంటున్నారు.

7/7

బందు మిత్రులతో కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేయడం ఇక్కడి ప్రత్యేకత. చాలామంది భక్తులు తమ ఇళ్ల నుంచే బియ్యం,పప్పు తెచ్చుకుని, మేడారం చెట్ల కింద 'వనభోజనాలు' చేస్తారు. ఇది ఒక గొప్ప పర్యాటక అనుభవాన్ని కూడా ఇస్తుంది. మేడారంఅంటే కేవలం మొక్కులు తీర్చుకోవడం మాత్రమే కాదు, అది తెలంగాణ గిరిజన అస్తిత్వానికి, ధైర్యానికి ప్రతీక. ఆధునిక ప్రపంచంలో మనిషికి, ప్రకృతికి ఉన్న విడదీయరాని బంధాన్ని ఈ జాతర గుర్తు చేస్తుంది.

Related Photos