ఇంకొన్ని రోజుల్లో లావా అగ్ని 4 5జీ లాంచ్​- స్మార్ట్​ఫోన్​పై మంచి బజ్​! ఫీచర్స్​ ఇవే..

Published on Nov 16, 2025 10:00 am IST

లావా అగ్ని 4 5జీ నవంబర్ 20న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. లాంచ్​కు ముందే, ఈ స్మార్ట్​ఫోన్​పై మంచి బజ్​ నెలకొంది. మరోవైపు కంపెనీ క్రమంగా గ్యాడ్జెట్​ ఫీచర్స్​ని టీజ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే లావా అగ్ని 4 5జీలో ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

1 / 6

ఈ లావా అగ్ని 4 ఫోన్ కస్టమైజ్ చేయగల యాక్షన్ బటన్​ను పొందుతుందని సంస్థ ధృవీకరించింది. ఇది షార్ట్​కట్​గా పనిచేస్తుంది. వినియోగదారులు ఒక నిర్దిష్ట యాప్​ను తెరవడానికి లేదా ఒక క్లిక్​తో ఏదైనా ఇతర పనిని చేయడానికి ఈ యాక్షన్ బటన్​ను వాడుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:00 am IST

ఈ లావా అగ్ని 4 ఫోన్ కస్టమైజ్ చేయగల యాక్షన్ బటన్​ను పొందుతుందని సంస్థ ధృవీకరించింది. ఇది షార్ట్​కట్​గా పనిచేస్తుంది. వినియోగదారులు ఒక నిర్దిష్ట యాప్​ను తెరవడానికి లేదా ఒక క్లిక్​తో ఏదైనా ఇతర పనిని చేయడానికి ఈ యాక్షన్ బటన్​ను వాడుకోవచ్చు.

2 / 6

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తుందని లావా ధృవీకరించింది. హీటింగ్​ని కంట్రోల్ చేయడానికి ఫోన్​లో వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:00 am IST

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తుందని లావా ధృవీకరించింది. హీటింగ్​ని కంట్రోల్ చేయడానికి ఫోన్​లో వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.

3 / 6

ఈ లావా అగ్ని 4 ఫోన్​లో 6.67 ఇంచ్​ 1.5 కే+ అమోలెడ్ డిస్​ప్లే లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ డిస్​ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్​నెస్, 10-బిట్ కలర్ డెప్త్, 446 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1.07 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది, ఇది ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కూడా అద్భుతమైన దృశ్యమానతను ఇస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:00 am IST

ఈ లావా అగ్ని 4 ఫోన్​లో 6.67 ఇంచ్​ 1.5 కే+ అమోలెడ్ డిస్​ప్లే లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ డిస్​ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్​నెస్, 10-బిట్ కలర్ డెప్త్, 446 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1.07 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది, ఇది ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కూడా అద్భుతమైన దృశ్యమానతను ఇస్తుంది.

4 / 6

స్టీల్ లాంటి ధృడమైన బిల్డ్ - ఈ ఫోన్ మ్యాట్ ఏజీ గ్లాస్ బ్యాక్, అల్ట్రా-స్లిమ్ 1.7 మిమీ బెజెల్స్​తో ఖచ్చితంగా రూపొందించిన అల్యూమినియం అల్లాయ్ మెటల్ ఫ్రేమ్​ను పొందుతుంది. ఈ ఫోన్ సూపర్ యాంటీ-డ్రాప్ డైమండ్ ఫ్రేమ్ స్ట్రక్చర్, ఐపీ64 రేటెడ్ బిల్డ్, 1 గంట వరకు వర్షాన్ని తట్టుకోగల సామర్థ్యం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​తో వస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది తడి చేతులతో ఉపయోగించడానికి వెట్-టచ్ కంట్రోల్​ను కూడా పొందుతుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:00 am IST

స్టీల్ లాంటి ధృడమైన బిల్డ్ - ఈ ఫోన్ మ్యాట్ ఏజీ గ్లాస్ బ్యాక్, అల్ట్రా-స్లిమ్ 1.7 మిమీ బెజెల్స్​తో ఖచ్చితంగా రూపొందించిన అల్యూమినియం అల్లాయ్ మెటల్ ఫ్రేమ్​ను పొందుతుంది. ఈ ఫోన్ సూపర్ యాంటీ-డ్రాప్ డైమండ్ ఫ్రేమ్ స్ట్రక్చర్, ఐపీ64 రేటెడ్ బిల్డ్, 1 గంట వరకు వర్షాన్ని తట్టుకోగల సామర్థ్యం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​తో వస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది తడి చేతులతో ఉపయోగించడానికి వెట్-టచ్ కంట్రోల్​ను కూడా పొందుతుంది.

5 / 6

కెమెరా డిజైన్​ను కంపెనీ వెల్లడించింది. ఇది పిల్​ షేప్​ కెమెరా మాడ్యూల్​ను కలిగి ఉంటుంది, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రైమరీ లెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అందుబాటులో ఉంటుంది. రెండు కెమెరాలు 4కే@60fps వీడియో రికార్డింగ్​కు మద్దతు ఇస్తాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:00 am IST

కెమెరా డిజైన్​ను కంపెనీ వెల్లడించింది. ఇది పిల్​ షేప్​ కెమెరా మాడ్యూల్​ను కలిగి ఉంటుంది, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రైమరీ లెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అందుబాటులో ఉంటుంది. రెండు కెమెరాలు 4కే@60fps వీడియో రికార్డింగ్​కు మద్దతు ఇస్తాయి.

6 / 6

ఈ స్మార్ట్​ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. లూనార్ మిస్ట్, ఫాంటమ్ బ్లాక్ రంగులు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:00 am IST

ఈ స్మార్ట్​ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. లూనార్ మిస్ట్, ఫాంటమ్ బ్లాక్ రంగులు.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!