Budget smartphone : 50ఎంపీ కెమెరాతో లావా కొత్త స్మార్ట్‌ఫోన్- బోల్డ్ 2 5జీ ధర రూ. 15వేల కన్నా తక్కువే
స్వదేశీ టెక్ దిగ్గజం 'లావా' భారత మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ 2 5జీని విడుదల చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన 'లావా బోల్డ్ 5జీ' కి ఇది సక్సెసర్. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ మోడల్ ఫీచర్స్, ధర వివరాలు ఇవిగో..
ఈ లావా బోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 6.67- ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్. ఇది 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది, దీనివల్ల ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన మీడియాడెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ను వాడారు. దీని అంటుటు (AnTuTu) స్కోరు 5 లక్షలకు పైగా ఉందని కంపెనీ చెబుతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఎలాంటి అన్వాంటెడ్ యాప్స్, యాడ్స్ ఉండవని లావా హామీ ఇచ్చింది. లావా బోల్డ్ 2 5జీలో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌తో కూడిన ఏఐ మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. దీనితో పాటు 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, దుమ్ము- నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 7.55 ఎంఎం మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది.
లావా బోల్డ్ 2 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999గా ఉంది. పరిమిత కాలం పాటు అన్ని రకాల పేమెంట్ పద్ధతులపై రూ. 1,000 డిస్కౌంట్ కూపన్ అందుబాటులో ఉంది. అంటే ఆఫర్‌లో ఈ ఫోన్ రూ. 12,999కే లభిస్తుంది.
మార్చి 19న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ద్వారా ఈ లావా బోల్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి. ఫెదర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఇది లభిస్తుంది.
E-Paper

