వ‌న్డే ఛేజింగ్‌లో టాప్ 5 మొన‌గాళ్లు వీళ్లే.. కోహ్లీ అరుదైన వరల్డ్ రికార్డు.. మరి రోహిత్ శర్మ స్థానం ఏంటి?

వ‌న్డే చ‌రిత్ర‌లో విజ‌య‌వంత‌మైన ర‌న్ ఛేజ్‌ల‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్ 5 బ్యాట‌ర్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీతో స‌హా ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు ఉండ‌గా, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా నుంచి ఒక్కో ఆట‌గాడికి చోటు ద‌క్కింది.

Published on: Oct 26, 2025 5:11 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వన్డే క్రికెట్‌లో విజయవంతమైన రన్ ఛేజ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఇప్పుడు తన ప్రపంచ రికార్డుకు మరింత వన్నె తెచ్చాడు. విజయవంతమైన రన్ ఛేజ్‌లలో ఆరు వేల (6072) పరుగుల మార్కును అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ 102 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. సిడ్నీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో అతను ఈ ఫీట్ సాధించాడు. సిడ్నీ వన్డేలో 81 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 5:11 PM

(AFP)

2/5

దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ విజయవంతమైన రన్ ఛేజ్‌లలో 5490 పరుగులు సాధించాడు. అతను 124 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక సచిన్ తన కెరీర్‌లో 463 వన్డే మ్యాచ్‌లలో మొత్తం 18426 పరుగులు చేశాడు. వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతనే.
(X)expand-iconView Photos in a new improved layout

(X)

3/5

ఈ జాబితాలో మూడో స్థానంలో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఉన్నాడు. అతను వన్డేలలో విజయవంతమైన రన్ ఛేజ్‌లలో 100 ఇన్నింగ్స్‌లలో 4701 పరుగులు చేశాడు. సిడ్నీ వన్డేలో రోహిత్ అద్భుతమైన సెంచరీ (125 బంతుల్లో అజేయంగా 121) సాధించాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ మాత్రమే కాదు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతను మొత్తం 202 పరుగులు సాధించాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 5:11 PM

ఈ జాబితాలో మూడో స్థానంలో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఉన్నాడు. అతను వన్డేలలో విజయవంతమైన రన్ ఛేజ్‌లలో 100 ఇన్నింగ్స్‌లలో 4701 పరుగులు చేశాడు. సిడ్నీ వన్డేలో రోహిత్ అద్భుతమైన సెంచరీ (125 బంతుల్లో అజేయంగా 121) సాధించాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ మాత్రమే కాదు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతను మొత్తం 202 పరుగులు సాధించాడు.

(AFP)

4/5

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ విజయవంతమైన రన్ ఛేజ్‌లలో 4186 పరుగులు సాధించాడు. అతను ఈ గణాంకాలను 104 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. పాంటింగ్ తన కెరీర్‌లో 375 వన్డే మ్యాచ్‌లలో మొత్తం 13704 పరుగులు చేశాడు.
(ICC)expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2025 5:11 PM

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ విజయవంతమైన రన్ ఛేజ్‌లలో 4186 పరుగులు సాధించాడు. అతను ఈ గణాంకాలను 104 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. పాంటింగ్ తన కెరీర్‌లో 375 వన్డే మ్యాచ్‌లలో మొత్తం 13704 పరుగులు చేశాడు.

(ICC)

5/5

ఈ జాబితాలో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ ఉన్నాడు. అతను 100 ఇన్నింగ్స్‌లలో 3950 పరుగులు సాధించాడు. కలిస్ తన కెరీర్‌లో 328 వన్డే మ్యాచ్‌లలో మొత్తం 11579 పరుగులు చేశాడు.

Related Photos