మహాభారతంలో నటించిన ఈ నటులు ఇప్పుడీ లోకంలో లేరు.. కర్ణుడి నుంచి భీముడి పాత్రధారి వరకు..
మహాభారతం టీవీ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఎప్పుడో 37 ఏళ్ల కిందట దూరదర్శన్ లో వచ్చిన ఈ షోలో నటించిన కొందరు నటులు ఇప్పుడు మన మధ్య లేరు. కర్ణుడు, హనుమంతుడు, భీముడులాంటి పాత్రలు పోషించిన వాళ్లందరూ కన్నుమూశారు.
1987లో వచ్చిన మహాభారతం షోకి మంచి ఆదరణ లభించింది. నేటికీ ఈ షోలోని ప్రతి పాత్ర అభిమానుల హృదయంలో నిలిచిపోయింది. ఈ షోలో ముఖ్యమైన పాత్రలు పోషించిన ఎంతో మంది నటులు కన్నుమూశారు. తాజాగా పంకజ్ ధీర్ వీళ్లలో చేరారు.
(instagram)
పంకజ్ ధీర్ - కర్ణుడి పాత్ర పోషించిన పంకజ్ ధీర్ తాజాగా కన్నుమూశాడు. క్యాన్సర్ తో బాధపడుతూ అతడు తుది శ్వాస విడిచాడు.
(instagram)
ధారా సింగ్ - ధారా సింగ్ మహాభారతంలో హనుమంతుడి పాత్రను పోషించాడు. రామాయణంలోనూ హనుమంతుడి పాత్రను పోషించాడు. ధారా సింగ్ 2012లో కన్నుమూశాడు.
(instagram)
ప్రవీణ్ కుమార్ - మహాభారతంలో భీముడి పాత్రలో నటించాడు. ప్రవీణ్ 2022లో కన్నుమూశాడు.
(instagram)
గుఫీ పెయింటల్ - మహాభారతంలో శకుని పాత్రను పోషించారు. గుఫీ 2023 సంవత్సరంలో కన్నుమూశారు.
(instagram)
గోగా కపూర్ -మహాభారతంలో కంసుడి పాత్రను పోషించారు. గోగా 2011లో మరణించారు.
(instagram)
వేద్ వ్యాస్ పాత్రలో నటించిన రాజేష్ వివేక్ 2016లో గుండెపోటుతో మరణించారు. (instagram)
వీరేంద్ర రాజ్దాన్ - విదురుడి పాత్రలో నటించిన వీరేంద్ర రాజ్దాన్ 2003లో మరణించారు.
(instagram)
మహాభారతంలో ఇంద్రుడి పాత్రను పోషించిన సతీష్ కౌల్ 2021 ఏప్రిల్ 10 న కన్నుమూశారు.
(instagram)
E-Paper

