...
...
Next Story

స్కూల్ టాయిలెట్‌లో రక్తపు మరకలు.. బట్టలు విప్పించి పీరియడ్స్ ఎవరికి ఉన్నాయో చెక్ చేయించిన ప్రిన్సిపల్!

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. పాఠశాల మరుగుదొడ్డిలో రక్తపు మరకలు కనిపించాయని, ఏ అమ్మాయికి పీరియడ్స్ అయ్యాయో బట్టు విప్పి చెక్ చేశారు.

Published on: Jul 10, 2025, 11:43:40 IST
By ,
Prefer HTon Google
Advertisement
<p>మహారాష్ట్రలోని థానే జిల్లా షహాపూర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలికలను బలవంతంగా బట్టలు విప్పారు. పీరియడ్స్ అవుతున్నాయో లేదో చెక్ చేశారు. ఈ ఘటనలో పాఠశాల ప్రిన్సిపాల్, అటెండర్‌ను అరెస్టు చేసి మరో ఆరుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..</p>

మహారాష్ట్రలోని థానే జిల్లా షహాపూర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలికలను బలవంతంగా బట్టలు విప్పారు. పీరియడ్స్ అవుతున్నాయో లేదో చెక్ చేశారు. ఈ ఘటనలో పాఠశాల ప్రిన్సిపాల్, అటెండర్‌ను అరెస్టు చేసి మరో ఆరుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మంగళవారం ఉదయం పాఠశాల మరుగుదొడ్డిలో రక్తపు మరకలు కనిపించాయి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు పీరియడ్స్ జరుగుతోందో లేదో తెలుసుకునేందుకు బట్టలు విప్పి చెక్ చేశారు ప్రిన్సిపాల్. తల్లిదండ్రులు, బాలల హక్కుల కార్యకర్తలు బుధవారం పాఠశాలకు చేరుకుని సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండగా పీరియడ్స్ రక్తపు మరకలు కనిపించాయి. సిబ్బంది ఆ ఫొటోలను ప్రిన్సిపాల్‌కు పంపించారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలను పాఠశాల కన్వెన్షన్ హాల్‌కు పిలిపించారు. వారిలో ఎవరికైనా పీరియడ్స్ అవుతున్నాయా అని అడిగారు. అవుతున్న వారిని, అవ్వని వారిని రెండు గ్రూపులుగా చేశారు. రుతుస్రావం కావడం లేదని చెప్పిన అమ్మాయిలను ఒక్కొక్కరుగా టాయిలెట్ కు తీసుకెళ్లి మహిళా అటెండెంట్ బలవంతంగా బట్టలు విప్పి చెక్ చేశారు. బాలిక అవయవాలను ముట్టుకుని పీరియడ్స్ అవుతున్నాయో లేదో చూశారు. ఇంటికెళ్లిన తర్వాత బాలికలు విషయాన్ని ఇంట్లో చెప్పారు.

ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 'నా కూతురు వణుకుతూ ఇంటికి వచ్చింది. వాష్ రూమ్ లో ఇతర విద్యార్థుల ముందు బలవంతంగా బట్టలు విప్పేశారని ఆమె తెలిపింది. ఇది క్రమశిక్షణ కాదు, మానసిక వేధింపు.' అని తల్లిదండ్రులు అన్నారు. తల్లిదండ్రులు పాఠశాల వద్ద గుమిగూడి బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని థానే (గ్రామీణ) అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ జల్టే తెలిపారు.

విద్యార్థుల ఫిర్యాదు మేరకు పాఠశాల ప్రిన్సిపాల్, నలుగురు ఉపాధ్యాయులు, అటెండర్లు, ఇద్దరు ధర్మకర్తలపై కేసు నమోదు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్, అటెండర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe