Male fertility tips : ఫ్యామిలీ ప్లానింగ్- పురుషులు 3 నెలల ముందే ఈ మార్పులు చేసుకోవాలి!

సంతానలేమి సమస్యల్లో దాదాపు 40 నుంచి 50 శాతం పురుషుల వల్లే జరుగుతున్నా, చాలా మంది దీనిని గుర్తించడం లేదు. వీర్యకణాలు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 90 రోజులు పడుతుంది. అందుకే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే పురుషులు మూడు నెలల ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

Published on: Jun 7, 2026 11:19 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

చాలామంది పురుషులు పెళ్లయిన కొన్ని సంవత్సరాల పాటు పిల్లల కోసం ప్రయత్నించి, అది విఫలమైన తర్వాతే క్లినిక్‌లకు వెళుతుంటారు. అప్పటికే వారు చేతులు దాటిపోయిన సమయాన్ని వృథా చేసుకుంటారు. పురుషులలో వీర్యకణాలు రాత్రికి రాత్రే పుట్టుకురావు. ఒక వీర్యకణం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 72 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. అంటే, ఒక పురుషుడు ఈ రోజు తీసుకునే ఆహారం, నిద్ర లేదా ధూమపానం వంటి అలవాట్ల ప్రభావం మూడు నెలల తర్వాత వచ్చే వీర్యకణాలపై కనిపిస్తుంది. కాబట్టి మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రారంభించాలనుకుంటే, ఆ మూడు నెలల కాలం చాలా కీలకం. సమస్య వచ్చాక చూద్దాం అని కూర్చుంటే మీరు రేసులో వెనుకబడినట్లే.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 7, 2026 11:19 AM

2/8

సాధారణంగా చేసే సెమెన్ అనాలిసిస్ పరీక్షలో కేవలం రెండు విషయాలనే చూస్తారు. ఒకటి వీర్యకణాల సంఖ్య ఎంత ఉంది? రెండు, అవి ఎంత వేగంగా ముందుకు వెళ్లగలుగుతున్నాయి? అయితే, ఇటీవలి పరిశోధనలు మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అదే వీర్యకణాలలోని డీఎన్ఏ నాణ్యత. తప్పుడు ఆహారపు అలవాట్లు, ధూమపానం లేదా పర్యావరణంలోని కాలుష్యం కారణంగా వీర్యకణాలలోని డీఎన్ఏ దెబ్బతింటుంది. దీనివల్ల గర్భస్రావాలు అవ్వడం లేదా పుట్టబోయే బిడ్డలో లోపాలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కేవలం ప్రెగ్నెన్సీ రావడం మాత్రమే ముఖ్యం కాదు, ఆరోగ్యకరమైన గర్భధారణ జరగడమే ఇక్కడ అసలైన విజయం. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ప్లానింగ్​కి ముందు పురుషులు చేయాల్సిన కొన్ని పనులను ఇక్కడ తెలుసుకోండి..

3/8

సరైన పోషకాలు తీసుకోండి - జింక్, సెలీనియం, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫోలేట్ వంటి యాంటీఆక్సిడెంట్లు వీర్యకణాలను రక్షించడమే కాకుండా వాటిలోని డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడతాయి. ఇవి తాజా పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలలో పుష్కలంగా లభిస్తాయి. సహజమైన ఆహారమే ఇక్కడ అద్భుతాలు చేస్తుంది.

4/8

బరువు అదుపులో ఉంచుకోండి- అధిక బరువు వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి, అలాగే వీర్యకణాల నాణ్యత దెబ్బతింటుంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువ ఉన్న పురుషులలో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ తక్కువగా ఉన్నట్లు తేలింది. పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా బరువు తగ్గితే కొద్ది నెలల్లోనే స్పర్మ్ హెల్త్ మెరుగవుతుంది.

5/8

హానికరమైన అలవాట్లకు స్వస్తి చెప్పండి- ధూమపానం, అతిగా మద్యం సేవించడం, అలవాటుగా తీసుకునే డ్రగ్స్ పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ధూమపానం పూర్తిగా మానేసిన పురుషులలో కేవలం మూడు నెలల్లోనే వీర్యకణాల నాణ్యత అద్భుతంగా పెరిగినట్లు స్పష్టమైంది. మన శరీరం మనం అనుకున్నదానికంటే వేగంగా కోలుకుంటుంది.

6/8

ఒత్తిడిని దూరం పెట్టండి- దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి, వీర్యకణాల ఆరోగ్యానికి అడ్డుపడుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం చేయడం లేదా క్రమంగా బ్రేక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. మీరు ఏ పద్ధతి ఎంచుకున్నా సరే, దానిని ప్రతిరోజూ పాటించడం ముఖ్యం.

7/8

ముందే పరీక్షలు చేయించుకోండి- సమస్యలు ముదిరిపోయే వరకు వేచి చూడకండి. ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత. జన్యుపరమైన లోపాలను ముందే గుర్తించడం ద్వారా వాటికి సులభంగా చికిత్స చేయవచ్చు.

8/8

మహిళల్లో సంతానోత్పత్తి అనేది వారి వయసు, అండాల నిల్వపై ఆధారపడి ఉంటుంది. కానీ పురుషుల్లో అలా కాదు. పురుషుల ఫెర్టిలిటీ అనేది వారి జీవనశైలి మార్పులకు వెంటనే స్పందిస్తుంది. మంచి ఆహారం తీసుకోవడం, బరువు తగ్గడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా కేవలం కొన్ని నెలల్లోనే వీర్యకణాల నాణ్యతను పెంచుకోవచ్చు. సంతానోత్పత్తి అనేది కేవలం మహిళలు మాత్రమే ఆలోచించాల్సిన విషయం కాదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అడుగులు వేయాలి. సమస్యలు రాకముందే అప్రమత్తమవ్వడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ జర్నీ చాలా సులభంగా సాగుతుంది.

Related Photos