2026 Maruti Suzuki brezza : మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్​ బుకింగ్స్​ షురూ..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మారుతీ సుజుకీ బ్రెజ్జా' సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలకు సిద్ధమైంది. జులై 23న ఈ మోడల్​ లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో బుకింగ్స్​, ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 16, 2026 12:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లలో మారుతీ సుజుకీ బ్రెజ్జా ఒకటి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నమ్మకానికి, మైలేజీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ కారు ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చేందుకు ముస్తాబైంది. జులై 23 లేదా 24న అధికారికంగా విడుదల కానున్న ఈ సరికొత్త 'బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్' మోడల్ కోసం కంపెనీ ముందస్తు బుకింగ్స్‌ను ప్రారంభించింది. కొత్త బ్రెజ్జాను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న మారుతీ సుజుకీ అరేనా డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2026 12:20 PM

2/5

ఈ సరికొత్త అప్‌డేట్‌లో బ్రెజ్జా పూర్తిగా మారిపోకుండా, కస్టమర్లను ఆకట్టుకునేలా అవసరమైన మేర డిజైన్ మార్పులతో వస్తోంది. లీకైన ఫోటోల ప్రకారం.. దీని ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను మరింత స్టైలిష్‌గా మార్చారు. కొత్త లైటింగ్ ఎలిమెంట్స్, సరికొత్త ఫోర్-స్పోక్ అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. కారు లోపలి భాగంలో సరికొత్త కలర్ స్కీమ్, డ్యాష్‌బోర్డ్‌పై కొత్త ట్రిమ్ ఆప్షన్లను జోడించారు.

3/5

మారుతీ సుజుకీ ఈసారి ఫీచర్ల పరంగా బ్రెజ్జాను మరింత బలోపేతం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఆధునిక కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఇందులో

10.1-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వేసవి కాలంలో ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కారు లోపల లగ్జరీ ఫీల్ ఇచ్చే యాంబియంట్ లైటింగ్, భద్రతను పటిష్టం చేసే లెవెల్-2 అడాస్ టెక్నాలజీ, టెస్టింగ్ సమయంలో ఈ కారు ముందు భాగంలో పార్కింగ్ సెన్సార్లు కూడా కనిపించాయి. ఇది సిటీల్లో కారును సులభంగా పార్క్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

4/5

ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో టాకింగ్ పాయింట్‌గా నిలిచింది దీని ఇంజిన్ అప్‌డేట్. మారుతీ సుజుకీ తన పాపులర్ 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను బ్రెజ్జాలో ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో టర్బో ఇంజిన్ లేని ఏకైక కారు బ్రెజ్జా మాత్రమే. ఈ లోటును కొత్త మోడల్ భర్తీ చేయనుంది. అయితే, ప్రస్తుతం ఉన్న నమ్మకమైన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ ఆప్షన్లు కూడా ఈ టర్బో ఇంజిన్‌తో పాటు అందుబాటులో ఉంటాయి.

5/5

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రెజ్జా మోడల్ ధర రూ. 8.26 లక్షల నుంచి రూ. 12.86 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫీచర్లు, టర్బో ఇంజిన్ వస్తున్నందున ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర ప్రస్తుత ధర కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత ఈ కారు టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ, కియా సోనెట్, కియా సైరోస్, స్కోడా కైలాక్ వంటి గట్టి ప్రత్యర్థులతో తలపడనుంది.

Related Photos