Maruti Suzuki Brezza Facelift : రేపే మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఈ అదిరిపోయే అప్డేట్తో!
మారుతీ సుజుకీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు రెడీ అయ్యింది. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకే బ్రెజ్జ్ కోసం మారుతీ సంస్థ కీలక అడుగు వేసింది. అదేంటంటే..
సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన 'మారుతీ సుజుకీ బ్రెజ్జా' సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమైంది. రేపే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మారుతీ సంస్థ భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. అయితే, లాంచ్‌కు ముందే ఈ కొత్త కారుకు సంబంధించిన కీలక వివరాలు, వీడియో లీక్స్ ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అత్యంత ప్రధానమైన మార్పు ఇంజిన్ విభాగంలోనే చోటుచేసుకుందని లీక్స్ సూచిస్తున్నాయి.
ఇంతకాలం కేవలం నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌కే పరిమితమైన బ్రెజ్జాలో, ఈసారి 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేస్తున్నారు. గతంలో ఫ్రాంక్స్, బలేనో ఆర్ఎస్ మోడళ్లలో 100 bhp పవర్, 147 Nm టార్క్‌ను అందించిన ఈ 3-సిలిండర్ టర్బో ఇంజిన్‌ను.. బ్రెజ్జా కోసం మరింత ట్యూన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా 110 bhp పవర్, 170 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం.
టర్బో వేరియంట్‌లో కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే లభించనుందని, ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
టర్బో ప్రేమికులతో పాటు మైలేజ్, రిఫైన్‌మెంట్ కోరుకునే వారి కోసం పాత 1.5-లీటర్, 4-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 101 bhp పవర్, 139 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇందులో మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు యథావిధిగా లభిస్తాయి.
లీకైన 'ZXi+' టాప్ వేరియంట్ వీడియోను పరిశీలిస్తే, డిజైన్ పరంగా కారు అత్యంత ప్రీమియంగా రూపుదిద్దుకుంది. ముందు భాగంలో స్పోర్టీగా కనిపించే 'స్మోక్డ్ క్రోమ్ గ్రిల్' (గోల్డెన్ ఫినిషింగ్) ఇచ్చారు. ఫ్రంట్, రియర్ బంపర్లతో పాటు సైడ్ క్లాడింగ్‌పై సిల్వర్ ఇన్సర్ట్‌లు కారుకు రాగ్‌డ్ ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్‌లను రీ-డిజైన్ చేసి కొత్త హౌసింగ్‌లో అమర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో సరికొత్త డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
E-Paper

