తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం - బంగారు తేరుపై మలయప్పస్వామి దివ్య విహారం, ఫొటోలు

Tirumala Brahmotsavam Swarna Rathotsavam 2026: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి స్వర్ణరథోత్సవం కంటిపాపలా సాగింది. గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగాయి.

Published on: Oct 19, 2026 11:22 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక శోభతో, కన్నులపండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం (అక్టోబరు 19) ఉదయం తిరుమలలో స్వర్ణరథోత్సవం కంగారు కాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.

expand-iconView Photos in a new improved layout
Published on Oct 19, 2026 11:22 AM

2/8

ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు నిగనిగలాడే స్వర్ణకాంతులతో మెరిసిపోయే బంగారు రథంపై కొలువుదీరి, నాలుగు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు

3/8

మంగళవాయిద్యాల దివ్యనాదాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి. స్వామివారి స్వర్ణరథ విహారాన్ని కళ్లారా చూసిన భక్తజనం భక్తిపారవశ్యంలో మునిగితేలారు.

4/8

స్వర్ణరథోత్సవంలో ప్రధాన ఆకర్షణగా మహిళలు నిలిచారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో స్వర్ణరథం తాళ్లను పట్టి ముందుకు లాగడం విశేషం.

5/8

బంగారు రథంపై ముచ్చటగా కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు తిరుమాడ వీధుల్లో గంటల తరబడి వేచి చూశారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ మైమరిచిపోయి నమస్కరించుకున్నారు.

6/8

శ్రీవారి స్వర్ణరథోత్సవాన్ని దర్శించుకోవడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. స్వర్ణరథంపై ఊరేగే లక్ష్మీ సమేతుడైన శ్రీవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యదాత్రి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో సమస్త సంపదలు, భోగభాగ్యాలు లభిస్తాయని క్షేత్ర ప్రాశస్త్యం చెబుతోంది.

7/8

అలాగే భూదేవి అనుగ్రహంతో ధాన్యసంపదలు, వేంకటాద్రీశుని కృపతో జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వర్ణరథంపై స్వామివారి ఈ అలభ్య దర్శనం భక్తులకు అపరిమితమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని, దైవానుగ్రహంపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగించింది.

8/8

ఈ పవిత్ర కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివార్లు పాల్గొని ఆధ్యాత్మిక కైంకర్యాలను పర్యవేక్షించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.

Related Photos