Plastic currency India : ఈ తేదీ నుంచే రూ. 10, రూ. 20 ‘ప్లాస్టిక్’ నోట్లు? సైజు మాత్రం సేమ్..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలోనే విప్లవాత్మకమైన ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను చలామణిలోకి తీసుకురానుందని తెలుస్తోంది. అంతే కాదు కొత్త నోట్ల సైజు పైనా కీలక వివరాలు బయటకు వచ్చాయి. వాటి గురించి ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Oct 31, 2026 11:21 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారతీయ కరెన్సీ వ్యవస్థలో మరో అతిపెద్ద సంచలనానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను దేశవ్యాప్తంగా చలామణిలోకి తెచ్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో, అంటే ఏప్రిల్ 1, 2027 నుంచి రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను 'పైలట్ ప్రాజెక్టు' కింద విడుదల చేయాలని ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. ఈ కొత్త ప్లాస్టిక్ నోట్ల సైజులు ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న కాగితపు రూ. 10, రూ. 20 నోట్ల పరిమాణంలోనే ఉంటాయి.

Published on Oct 31, 2026 11:21 AM

2/5

సాధారణంగా నోట్ల సైజులు లేదా పరిమాణాలు మారినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం మెషిన్లలో మార్పులు చేయాల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు ఏటీఎం రీకాన్ఫిగరేషన్ కోసం వందల కోట్ల రూపాయలు ముందస్తుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. గతంలో డీమోనిటైజేషన్ సమయంలో కొత్త నోట్ల సైజుల కోసం ఏటీఎంలను మార్చడానికి బ్యాంకులు భారీగా వెచ్చించాల్సి వచ్చింది. అయితే, కొత్త ప్లాస్టిక్ నోట్ల పరిమాణాన్ని ఏమాత్రం మార్చకపోవడం వల్ల ఏటీఎంల మార్పుల కోసం బ్యాంకులు రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

3/5

చిన్న నోట్లయిన రూ. 10, రూ. 20 నోట్లు నిత్యం మార్కెట్లో లక్షలాది మంది చేతులు మారుతుంటాయి. దీనివల్ల కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం, తడిసి పాడవ్వడం, లేదా మురికిపట్టి చలామణికి పనికిరాకుండా పోవడం జరుగుతోంది. "కొన్ని విదేశీ దేశాల్లో ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లు ఏకంగా 30 ఏళ్లకు పైగా చెక్కుచెదరకుండా మన్నికగా ఉన్న దాఖలాలు ఉన్నాయి. మన దేశంలో నిత్యం అత్యంత వేగంగా చేతులు మారే చిన్న నోట్లకు ఈ ప్లాస్టిక్ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది," అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్బీఐకి చెందిన ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఇప్పటికే గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించింది. భద్రతా ఫీచర్లు కలిగిన ప్లాస్టిక్ షీట్లను సరఫరా చేసే కంపెనీలను ఎంపిక చేస్తోంది.

4/5

మొదటి విడతగా ప్రయోగాత్మకంగా మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రింట్ చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందులో 100 కోట్ల రూ. 10 ప్లాస్టిక్ నోట్లు, 100 కోట్ల రూ. 20 ప్లాస్టిక్ నోట్లు ఉంటాయి. వాతావరణ పరిస్థి తులు, ప్రజల వినియోగం, నోట్ల మన్నిక, రవాణా సౌలభ్యాన్ని పరిశీలించిన తర్వాతే వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం లేదు. ప్లాస్టిక్ నోట్లు వచ్చినప్పటికీ, కాగితపు నోట్లతో పాటు కూడా సమాంతరంగా చలామణిలో ఉంటాయి.

5/5

ఇదే సమయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్తపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మార్కెట్లోకి కొత్తగా రూ. 1000 ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. "కొత్తగా రూ. 1000 ప్లాస్టిక్ నోటును విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం, నకిలీవి. ఆర్బీఐ రూ. 1000 నోటుపై ఎలాంటి ప్రకటన చేయలేదు," అని పీఐబీ ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది. పెద్ద నోట్లలో ప్లాస్టిక్ కరెన్సీని తెచ్చే ఆలోచన ప్రస్తుతానికి ఆర్బీఐ వద్ద ఏదీ లేదని, కేవలం చిన్న నోట్ల మన్నికను పెంచడానికే ఈ ప్రయోగం చేస్తున్నట్లు అధికారులు పునరుద్ఘాటించారు.

Related Photos