OnePlus 15T : 7500ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ డ్యూయెల్​ కెమెరాతో వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్​- ధర..

Published on Mar 25, 2026 12:11 pm IST

OnePlus 15T price in India : వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ‘వన్​ప్లస్​ 15టీ’ని చైనాలో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అదిరిపోయే గేమింగ్ పవర్‌తో వచ్చిన ఈ స్మార్ట్​ఫోన్, టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

1 / 5

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో సరికొత్త సంచలనం 'వన్‌ప్లస్ 15టీ'ని ఇటీవలే చైనాలో ఆవిష్కరించింది. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో, ఐదు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా గేమర్స్, పవర్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో దీనిని రూపొందించారు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 25, 2026 12:11 pm IST

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో సరికొత్త సంచలనం 'వన్‌ప్లస్ 15టీ'ని ఇటీవలే చైనాలో ఆవిష్కరించింది. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో, ఐదు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా గేమర్స్, పవర్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో దీనిని రూపొందించారు.

2 / 5

చైనాలో వన్‌ప్లస్ 15టీ బేస్ వేరియంట్ (12GB+256GB) ధర సీఎన్​వై 4,299 (సుమారు రూ. 58,000) నుంచి ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన టాప్-ఎండ్ మోడల్ (16GB+1TB) ధర సీఎన్​వై 5,699 (సుమారు రూ. 78,000) గా ఉంది. ఈ ఫోన్ చైనాలో మార్చి 25 ఉదయం నుంచి అమ్మకానికి రానుంది. ఇవి హీలింగ్ వైట్ చాక్లెట్, ప్యూర్ కోకో, రిలాక్సింగ్ మచ్చా రంగుల్లో లభిస్తాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 25, 2026 12:11 pm IST

చైనాలో వన్‌ప్లస్ 15టీ బేస్ వేరియంట్ (12GB+256GB) ధర సీఎన్​వై 4,299 (సుమారు రూ. 58,000) నుంచి ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన టాప్-ఎండ్ మోడల్ (16GB+1TB) ధర సీఎన్​వై 5,699 (సుమారు రూ. 78,000) గా ఉంది. ఈ ఫోన్ చైనాలో మార్చి 25 ఉదయం నుంచి అమ్మకానికి రానుంది. ఇవి హీలింగ్ వైట్ చాక్లెట్, ప్యూర్ కోకో, రిలాక్సింగ్ మచ్చా రంగుల్లో లభిస్తాయి.

3 / 5

వన్‌ప్లస్ 15Tలో ప్రధాన ఆకర్షణ దీని 7,500ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.8 గంటల పాటు ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.32- ఇంచ్ ఫుల్​-హెచ్​డీ+ అమోఎల్​ఈడీ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 60Hz నుంచి 165హెచ్​జెడ్​ వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. కంటి రక్షణ కోసం దీనికి TUV Rheinland సర్టిఫికేషన్ కూడా లభించింది.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 25, 2026 12:11 pm IST

వన్‌ప్లస్ 15Tలో ప్రధాన ఆకర్షణ దీని 7,500ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.8 గంటల పాటు ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.32- ఇంచ్ ఫుల్​-హెచ్​డీ+ అమోఎల్​ఈడీ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 60Hz నుంచి 165హెచ్​జెడ్​ వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. కంటి రక్షణ కోసం దీనికి TUV Rheinland సర్టిఫికేషన్ కూడా లభించింది.

4 / 5

ఈ ఫోన్‌లో క్వాల్కమ్ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన స్నాప్​డ్రాగన్​ ఇలైట్​ జెన్​ 5 చిప్‌సెట్‌ను వాడారు. గేమింగ్ కోసం ప్రత్యేకంగా ‘ఈ-స్పోర్ట్స్ ట్రిపుల్ కోర్’ టెక్నాలజీని ఇందులో చేర్చారు. దీనివల్ల గేమింగ్ సమయంలో ఎక్కడా లాగ్ లేకుండా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. అన్‌టుటు బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫోన్ ఏకంగా 44,50,000 పాయింట్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒప్పో కలర్​ఓస్​ 16పై పనిచేస్తుంది.
(Representative image) expand-icon View Photos in a new improved layout

(Representative image)

5 / 5

వన్‌ప్లస్ 15Tలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ అల్ట్రా విజన్ సెన్సార్​తో కూడిన ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ (3.5x ఆప్టికల్ జూమ్, 7x లాస్‌లెస్ డిజిటల్ జూమ్) దీని సొంతం. ఫ్రెంట్​లో 16 మెగాపిక్సెల్ షూటర్. ఈ ఫోన్ ద్వారా 8కే నాణ్యతతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అదనంగా, ఇది దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69K వంటి అత్యున్నత రేటింగ్లను కలిగి ఉంది.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!