Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన పెద్ది- ఎక్స్ట్రా సీన్స్‌తో! రామ్‌చరణ్ సినిమా ఓవరాల్ కలెక్షన్లు ఎంత?
2026లో టాలీవుడ్ బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటైన పెద్ది సినిమా ఇప్పుడు.. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. రామ్‌చరణ్ తేజ, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ది ఓవరాల్ కలెక్షన్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఓ యువకుడి పోరాటానికి సంబంధించిన కథే ఈ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అద్భుత నటనకు గాను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ మంచి ప్రసంశలు అందుకున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మీరు ఈ పెద్ది సినిమాని చూడవచ్చు. అయితే, థియేటర్ కట్ కంటే ఓటీటీ కట్ కాస్త ఎక్కువగా ఉంది. థియేటర్ వర్షెన్‌లో లేని కొన్ని సీన్లు, ఓటీటీ వర్షెన్‌లో యాడ్ చేశారు.
పలు నివేదికల ప్రకారం పెద్ది వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 333కోట్లుగా ఉంది. ఒక్క మన దేశంలోనే గ్రాస్ రూ. 282కోట్లుగా ఉంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 51కోట్లు రాబట్టింది.
టాలివుడ్‌లోనే 11వ హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాగా పెద్ది నిలిచింది. హిందీ వర్షెన్‌కి ఆశించిన మేర వసూళ్లు రాకపోయినా.. తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు చూస్తే మాత్రం.. పెద్ది సినిమా బ్లాక్‌బస్టర్ అనే చెప్పాలి.
ఇక నెట్‌ఫ్లిక్స్.. ఈ పెద్ది సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ. 105 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు వెచ్చించినట్టు సమాచారం.
E-Paper

