AP Telangana Rains : ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ - మరో 2 రోజులు వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు

ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published on: Mar 20, 2026 3:24 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.

expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 3:24 PM

2/8

నిన్నటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర కర్ణాటక వరకు దక్షిణ అంతర కర్ణాటక మరియు తమిళనాడు అంతర్భాగముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అల్పపీడన ద్రోణి కూడా విస్తరించి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
(image source @APSDMA)expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 3:24 PM

నిన్నటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర కర్ణాటక వరకు దక్షిణ అంతర కర్ణాటక మరియు తమిళనాడు అంతర్భాగముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అల్పపీడన ద్రోణి కూడా విస్తరించి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

(image source @APSDMA)

3/8

ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(AFP File )expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 3:24 PM

ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

(AFP File )

4/8

ఇవాళ తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (30-40 కి.మీ వేగం) కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 3:24 PM

ఇవాళ తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (30-40 కి.మీ వేగం) కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

5/8

రేపు (మార్చి 21) మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 3:24 PM

రేపు (మార్చి 21) మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

6/8

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తాలో ఇవాళ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు, ఎల్లుండి కూడా పడొచ్చని పేర్కొంది.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 3:24 PM

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తాలో ఇవాళ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు, ఎల్లుండి కూడా పడొచ్చని పేర్కొంది.

7/8

దక్షిణ కోస్తాలో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 20, 2026 3:24 PM

దక్షిణ కోస్తాలో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి.

8/8

రాయలసీమ జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు పడే సూచనలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Photos