Ranabaali : 'రణబాలి'గా వచ్చేసిన విజయ్ దేవరకొండ- సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్, ఓటీటీ డీల్ వివరాలు..
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్ కలిసి నటించిన రణబాలి సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి..

వరుస ఫ్లాప్ల తర్వాత విజయ్ దేవరకొండ సాలిడ్ స్టోరీతో అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో రణబాలి థియేటర్లలో ప్రజలను అలరిస్తోంది. అయితే ఈ సినిమాను రూ .120కోట్ల బడ్జెట్లో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. తొలుత రూ. 80కోట్లల్లో పూర్తి చేయాలని భావించినా.. అదనంగా మరో రూ. 40కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం.

డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్- రష్మిక జంట కలిసి నటించిన ఈ రణబాలి టీజర్ అందరిని ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా కోసం వీరిద్దరు కలిపి రూ. 30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ రణబాలి సినిమాకు ఇప్పటికే ఓటీటీ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు సమాచరం. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్.. విజయ్ దేవరకొండ సినిమాను కొనుగోలు చేసింది. ఆడియో, శాటిలైట్, నాన్ థ్రియేట్రికల్ రైట్స్ రూపంలో రణబాలి మేకర్స్ ఇప్పటికే రూ. 60ట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. అంటే థియేటర్లో విజయ్ దేవరకొండ సినిమా మరో రూ. 60కోట్లు సాధిస్తే బ్రేక్ఈవెన్ అవుతుంది.

1870 దశకంలో మద్రాసు ప్రాంవీన్సులో వచ్చిన కరవు నేపథ్యంలో రాయలసీన వాసులు ఎలా ప్రభావితం అయ్యారు? బ్రిటీషర్లు వారిని ఎలా అణచివేసేందుకు ప్రయత్నించారు? అన్న కథే రణబాలి. ఈ సినిమాకు డైరక్టర్ రాహుల్ సంకృత్యాన్.

విజయ్ దేవకొండ- రష్మిక మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ది కూడా క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి! గతంలో వీరిద్దరు కలిసి చేసిన ట్యాక్సీవాలా సినిమా బంపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

E-Paper

