Redmi 15A : రూ. 12999కే 6300ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​- రెడ్​మీ 15ఏ ఫీచర్లు ఇవే..

భారత బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్​లో తన పట్టును మరింత పెంచుకునేందుకు షావోమీ సరికొత్త రెడ్‌మీ 15ఏ 5జీని తాజాగా లాంచ్ చేసింది. అదిరిపోయే బ్యాటరీ లైఫ్, భారీ డిస్‌ప్లే, సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ మోడల్​ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 28, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రెడ్‌మీ 15ఏ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్: రూ. 12,999, 4GB RAM + 128GB స్టోరేజ్: రూ 14,499, 6GB RAM + 128GB స్టోరేజ్: రూ. 16,499గా ఉన్నాయి. ఈ ఫోన్ ఆసమ్ బ్లూ, అమేజ్ పర్పుల్, ఏస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 3 నుంచి షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రీటైల్ స్టోర్లలో దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 28, 2026 11:20 AM

2/5

ఈ స్మార్ట్‌ఫోన్ 6.9- ఇంచ్​ భారీ హెచ్​డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు దీనికి TÜV సర్టిఫికేషన్ కూడా ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇందులో వెట్ టచ్ టెక్నాలజీ 2..0 ఉంది. దీనివల్ల మీ వేళ్లు తడిగా ఉన్నా సరే స్క్రీన్ సులభంగా స్పందిస్తుంది.

3/5

రెడ్‌మీ 15ఏ 5జీలో యూనీఐఎస్​ఓసీ టీ8300 5జీ ప్రాసెసర్‌ను వాడారు. ఇందులో 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్​ఓఎస్​ 3పై నడుస్తుంది. షావోమీ ఈ ఫోన్‌కు ఏకంగా 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని హామీ ఇచ్చింది. బడ్జెట్ ధరలోనే గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

4/5

రెడ్​మీ 15ఏ స్మార్ట్​ఫోన్ వెనుక భాగంలో 32ఎంపీ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరా అమర్చారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో భారీ 6,300ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 15డబ్ల్యూ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ (ఇతర పరికరాలను ఛార్జ్ చేసే సౌకర్యం) కూడా సపోర్ట్ చేస్తుంది.

5/5

ఈ స్మార్ట్​ఫోన్​లో 200 శాతం వాల్యూమ్ అవుట్‌పుట్ ఇచ్చే స్టీరియో స్పీకర్లు, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ52 రేటింగ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

Related Photos