Redmi Note 15 SE : రూ. 20వేల స్మార్ట్​ఫోన్​పై 4వేల వరకు ఆఫర్లు- క్రేజీ ఫీచర్స్​తో రెడ్​మీ గ్యాడ్జెట్​..

షావోమీ తన పాపులర్ నోట్ సిరీస్‌లో 'రెడ్‌మీ నోట్ 15 5జీ స్పెషల్ ఎడిషన్'ను భారత్‌లో విడుదల చేసింది. కర్వ్‌డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్, బడ్జెట్ ధరలో ప్రీమియం అనుభూతిని అందించనుంది. ఏప్రిల్ 7 నుంచి ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు..

Published on: Apr 3, 2026 11:31 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ రెడ్​మీ నోట్​ 15 5జీ స్పెషల్​ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం కర్వ్‌డ్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఫాక్స్ లెదర్ లేదా ప్లాస్టిక్ ప్యానల్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 6.77 ఇంచ్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120హెచ్​జెడ్​ రీఫ్రెష్ రేట్, 2392 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఐపీ65 + ఐపీ66 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 3, 2026 11:31 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్ 6GB + 128GB ధర రూ. 19,999, 8GB + 128GB ధర రూ. 21,999,

8GB + 256GB ధర రూ. 23,999గా ఉంది. కాగా లాంచ్ ఆఫర్ కింద షావోమీ రూ. 4,000 ఇంట్రడక్టరీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీనికి అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పేమెంట్ చేస్తే మరో రూ. 2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఏప్రిల్ 7, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్, షావోమీ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

3/5

రెడ్‌మీ నోట్ 15 5జీ స్పెషల్ ఎడిషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 8GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2పై నడుస్తుంది. ముఖ్యంగా, ఈ ఫోన్‌కు 4 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని షావోమీ హామీ ఇచ్చింది.

4/5

ఈ స్మార్ట్​ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో లైట్ ఫ్యూజన్ 400 సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా , 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 20ఎంపీ కెమెరాను అమర్చారు. డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సపోర్ట్ చేసే డ్యూయల్ స్పీకర్లు వినియోగదారులకు మంచి ఆడియా క్వాలిటీ అందిస్తాయి.

5/5

ఈ ఫోన్‌లో 5,800ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉంది, ఇది 45డబ్ల్యూ టర్బో ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5జీ, బ్లూటూత్ 5.1, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది క్రిమ్సన్ రిజర్వ్, ఫ్రాస్టెడ్ వైట్ మరియు కార్బన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

Related Photos