Renault Duster : గ్రాండ్ రీ-ఎంట్రీకి రెనాల్ట్ డస్టర్ రెడీ: మార్చ్ 17న లాంచ్..
భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఎస్‌యూవీల్లో ఒకటిగా పేరుగాంచిన రెనాల్ట్ డస్టర్‌ని సంస్థ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇక 2022లో నిలిపివేసిన ఈ కారును, ఈ మార్చ్ 17న అధికారికంగా రీ-లాంచ్ చేసేందుకు సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకున్న ఈ కారు డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నాయి.
కొత్త డస్టర్ వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మూడు ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది:
1.8-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్: ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేసి ఉంటుంది. ఇది 160 బీహెచ్పీ పవర్, 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.3-లీటర్ టర్బో-పెట్రోల్: ఇది 163 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఇది మాన్యువల్, డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
1.0-లీటర్ టర్బో-పెట్రోల్: ఇది బేస్ వేరియంట్లలో లభిస్తుంది. 100 బీహెచ్పీ పవర్ ఇచ్చే ఈ ఇంజిన్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.
ఈ రెనాల్ట్ డస్టర్ గ్లోబల్ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఇండియా కోసం కొన్ని మార్పులు చేశారు.
ఎల్ఈడీ డీఆర్ఎల్: ఐబ్రో-స్టైల్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు దీనికి సరికొత్త లుక్‌నిస్తాయి.
గ్రిల్: కొత్త డస్టర్ బ్యాడ్జింగ్‌తో గ్రిల్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది.
లుక్: సిల్వర్ యాక్సెంట్స్‌తో కూడిన బంపర్, పిక్సెల్-షేప్ ఫాగ్ లాంప్స్ దీనికి రగ్గడ్ లుక్‌ని అందిస్తాయి.
ఈ ఎస్యూవీ లోపలి భాగంలో రెనాల్ట్ కంఫర్ట్, లగ్జరీకి పెద్దపీట వేసింది:
డిస్ప్లే: 10.1- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్), 10.25- ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి.
ప్రీమియం ఫీచర్లు: పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, 6-వే అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.
సేఫ్టీ: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్)తో పాటు లెవల్ 2 ADAS వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి
కొత్త డస్టర్ కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌లో టర్బో-పెట్రోల్ వేరియంట్లు డెలివరీ అవుతాయి. అయితే, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు దీపావళి 2026 నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ ధరల వివరాలను సంస్థ లాంచ్ టైమ్‌లో వెల్లడించే అవకాశం ఉంది.
E-Paper

