Rohit Sharma : రియల్​ ఎస్టేట్​లోనూ సిక్సర్లు కొడుతున్న రోహిత్​ శర్మ! కోట్లల్లో డీల్స్..

భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ మైదానంలోనే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ దూసుకెళుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్​మ్యాన్ రియల్​ ఎస్టేట్​ బిజినెస్​ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 21, 2026 9:10 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

క్రికెట్ మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ.. వ్యాపార, పెట్టుబడుల ప్రపంచంలోనూ అదే స్థాయిలో తెలివైన వ్యూహాలతో దూసుకుపోతున్నాడు! దేశంలోని ఇతర ప్రముఖ క్రీడా దిగ్గజాల తరహాలోనే, రోహిత్ కూడా తన సంపాదనను సురక్షితమైన, భారీ రాబడినిచ్చే ప్రీమియం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నాడు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడమే కాకుండా, వాటి ద్వారా ప్రతినెల లక్షల్లో అద్దె ఆదాయాన్ని పొందుతూ ఒక బలమైన ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 21, 2026 9:10 AM

2/5

రోహిత్ శర్మ కుటుంబం నుంచి మరొక భారీ రియల్ ఎస్టేట్ డీల్ ఇటీవలే పూర్తయింది. రోహిత్ భార్య రితీకా సజ్దే, ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ‘అహుజా టవర్స్’లో ఏకంగా రూ. 26.30 కోట్లు వెచ్చించి ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. అరబిక్ సముద్ర తీర అందాలు కనిపించేలా ఉండే ఈ లగ్జరీ ఫ్లాట్ 2,760.40 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. దీనితో పాటు ఈ ఫ్లాట్ కోసం ప్రత్యేకంగా మూడు కార్ పార్కింగ్ స్లాట్లను కేటాయించారు. ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ఈ టవర్, రోహిత్ కుటుంబపు లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అద్దం పడుతోంది.

3/5

రియల్ ఎస్టేట్ డేటా సంస్థ ‘స్క్వేర్ యార్డ్స్’ పరిశీలించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ లావాదేవీకి సంబంధించి స్టాంప్ డ్యూటీ కింద రూ. 1.31 కోట్లు, రిజిస్ట్రేషన్ రుసుము కింద రూ. 30,000 చెల్లించారు. ఈ కొత్త అపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 12, 2025న అధికారికంగా పూర్తయింది.

4/5

కేవలం భారీ ఇళ్లను కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, వాటిని సరైన సమయంలో లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన అద్దె రాబడిని పొందడంలోనూ రోహిత్ శర్మ సిద్ధహస్తుడని నిరూపించుకుంటున్నాడు. లోయర్ పరేల్ ప్రాంతంలోని 'ది పార్క్' లో ఉన్న 'లోధా మార్క్వాయిస్' టవర్‌లో 45వ అంతస్తులో రోహిత్‌కు 1,298 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ ఉంది. జనవరి 2025లోనే ఈ ప్రీమియం ఫ్లాట్‌ను నెలకు రూ. 2.60 లక్షల అద్దెకు ఆయన లీజుకు ఇచ్చారు. రెండు కార్ పార్కింగ్‌లతో కూడిన ఈ ఇంటి ద్వారా రోహిత్‌కు ప్రతినెల నిలకడగా లక్షల రూపాయిల రాబడి వస్తోంది.

5/5

ఇక జనవరి 2024లో ముంబై వెస్ట్రన్ సబర్బ్స్‌లో భాగమైన బాంద్రా వెస్ట్‌లో ఉన్న తన రెండు అపార్ట్‌మెంట్లను మూడేళ్ల కాలపరిమితితో ఆయన లీజుకు ఇచ్చాడు. ఈ ఒప్పందం ప్రకారం మొదటి ఏడాదికి నెలకు రూ. 3.10 లక్షలు, రెండవ ఏడాదికి రూ. 3.25 లక్షలు, మూడో ఏడాదికి నెలకు రూ. 3.41 లక్షల చొప్పున అద్దె వచ్చేలా నిబంధనలు పొందుపరిచారు. ముంబై నగరంలో విలాసవంతమైన ఇళ్లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను రోహిత్ శర్మ సరిగ్గా వినియోగించుకుంటున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Related Photos