రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. 500 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరనున్న హిట్ మ్యాన్.. ఆ లిస్ట్‌లోని భార‌త బ్యాట‌ర్లు వీళ్లే

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (అక్టోబర్ 19) నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్‌లో జరగనుంది. పెర్త్ వన్డేలో బరిలోకి దిగగానే రోహిత్ శర్మ ఓ అరుదైన క్లబ్‌లో చేరతాడు. అది అతనికి 500వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్లు ఇంకా ఎవరున్నారో చూసేయండి.

Published on: Oct 18, 2025 8:24 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారత్ తరఫునే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ దిగ్గజ బ్యాటర్ తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 664 మ్యాచ్‌లు ఆడి 34357 పరుగులు చేశాడు. అతను 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
(X)expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 8:24 PM

(X)

2/5

ఈ జాబితాలో రెండో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతను ఇప్పటివరకు 550 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 27599 పరుగులు చేశాడు. 36 ఏళ్ల కోహ్లీ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్, T20Iల నుండి రిటైర్ అయిన కోహ్లీ, ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 8:24 PM

ఈ జాబితాలో రెండో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతను ఇప్పటివరకు 550 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 27599 పరుగులు చేశాడు. 36 ఏళ్ల కోహ్లీ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్, T20Iల నుండి రిటైర్ అయిన కోహ్లీ, ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు.

(AFP)

3/5

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 17266 పరుగులు సాధించాడు. అతను 90 టెస్టులు, 350 వన్డేలు, 98 T20I మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2019లో ఆడాడు.
(X)expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 8:24 PM

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 17266 పరుగులు సాధించాడు. అతను 90 టెస్టులు, 350 వన్డేలు, 98 T20I మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2019లో ఆడాడు.

(X)

4/5

ఈ జాబితాలో నాలుగో స్థానంలో మాజీ దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. అతను 1996 నుండి 2012 వరకు భారత్ తరఫున 509 మ్యాచ్‌లు ఆడి 24208 పరుగులు సాధించాడు. ద్రవిడ్ తన కెరీర్‌లో 164 టెస్టులు, 344 వన్డేలు, ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
(BCCI)expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 8:24 PM

ఈ జాబితాలో నాలుగో స్థానంలో మాజీ దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. అతను 1996 నుండి 2012 వరకు భారత్ తరఫున 509 మ్యాచ్‌లు ఆడి 24208 పరుగులు సాధించాడు. ద్రవిడ్ తన కెరీర్‌లో 164 టెస్టులు, 344 వన్డేలు, ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

(BCCI)

5/5

'హిట్‌మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ ఆదివారం (అక్టోబర్ 19)న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి వన్డేలో మైదానంలోకి అడుగుపెట్టగానే ఓ అరుదైన క్లబ్‌లో చేరతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఐదో భారతీయుడిగా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా నిలుస్తాడు. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటివరకు 499 మ్యాచ్‌ల్లో 19700 పరుగులు చేశాడు. అతను 67 టెస్టులు, 273 వన్డేలు, 159 T20Iలు ఆడాడు. రోహిత్ కూడా టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 8:24 PM

'హిట్‌మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ ఆదివారం (అక్టోబర్ 19)న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి వన్డేలో మైదానంలోకి అడుగుపెట్టగానే ఓ అరుదైన క్లబ్‌లో చేరతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఐదో భారతీయుడిగా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా నిలుస్తాడు. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటివరకు 499 మ్యాచ్‌ల్లో 19700 పరుగులు చేశాడు. అతను 67 టెస్టులు, 273 వన్డేలు, 159 T20Iలు ఆడాడు. రోహిత్ కూడా టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

(PTI)

Related Photos