Vaibhav Sooryavanshi : బుడ్డోడు మళ్లీ దంచికొట్టాడు! దెబ్బకు ఆ​ రికార్డులు బ్రేక్..

RR vs SRH : ఐపీఎల్ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది, లీగ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను లిఖించాడు.

Published on: Apr 26, 2026 7:28 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వైభవ్ సూర్యవంశీ పవర్ హిట్టింగ్‌కు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ టీనేజ్ వండర్ కేవలం 36 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 278.38గా నమోదైంది. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ అనేక దిగ్గజ రికార్డులను తుడిచిపెట్టేశాడు.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 7:28 AM

వైభవ్ సూర్యవంశీ పవర్ హిట్టింగ్‌కు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ టీనేజ్ వండర్ కేవలం 36 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 278.38గా నమోదైంది. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ అనేక దిగ్గజ రికార్డులను తుడిచిపెట్టేశాడు.

(REUTERS)

2/5

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతులు) పేరిట ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక విభాగంలో వైభవ్ అతన్ని మించిపోయాడు. ఐపీఎల్‌లో 40 కంటే తక్కువ బంతుల్లో రెండు సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 7:28 AM

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతులు) పేరిట ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక విభాగంలో వైభవ్ అతన్ని మించిపోయాడు. ఐపీఎల్‌లో 40 కంటే తక్కువ బంతుల్లో రెండు సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

(PTI)

3/5

వైభవ్ తన మొదటి సెంచరీని 2025లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సాధించాడు. ఇప్పుడు సన్‌రైజర్స్‌పై 36 బంతుల్లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. క్రిస్ గేల్ రెండో ఫాస్టెస్ట్ సెంచరీ 46 బంతుల్లో రాగా, వైభవ్ మాత్రం తన రెండు సెంచరీలను 40 బంతుల లోపే బాదేయడం విశేషం.
(HT_PRINT)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 7:28 AM

వైభవ్ తన మొదటి సెంచరీని 2025లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సాధించాడు. ఇప్పుడు సన్‌రైజర్స్‌పై 36 బంతుల్లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. క్రిస్ గేల్ రెండో ఫాస్టెస్ట్ సెంచరీ 46 బంతుల్లో రాగా, వైభవ్ మాత్రం తన రెండు సెంచరీలను 40 బంతుల లోపే బాదేయడం విశేషం.

(HT_PRINT)

4/5

కేవలం సెంచరీలతోనే కాదు, పరుగుల వేటలోనూ వైభవ్ మెరుపులు మెరిపిస్తున్నాడు! ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కేవలం 473 బంతుల్లోనే ఈ ఘనత సాధించి మిచెల్ ఓవెన్, ఆండ్రూ సైమండ్స్ వంటి దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేశాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 7:28 AM

కేవలం సెంచరీలతోనే కాదు, పరుగుల వేటలోనూ వైభవ్ మెరుపులు మెరిపిస్తున్నాడు! ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కేవలం 473 బంతుల్లోనే ఈ ఘనత సాధించి మిచెల్ ఓవెన్, ఆండ్రూ సైమండ్స్ వంటి దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేశాడు.

(PTI)

5/5

కాగా ఈ మ్యాచ్​లో వైభవ్​ సెంచరీ వృథా అయ్యింది. 229 పరుగుల టార్గెట్​తో బరిలో దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ మరో 9 బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది. అభిషేక్​ శర్మ, ఇషాన్​ కిషన్ మెరుపులు జట్టుకు విజయాన్ని అందించాయి. తాజా మ్యాచ్​ అనంతరం ఐపీఎల్​ పాయింట్స్​ టేబుల్​లో ఆర్​ఆర్​ని వెనక్కి నెట్టి ఎస్​ఆర్​హెచ్​ 3వ స్థానానికి చేరుకుంది.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 7:28 AM

కాగా ఈ మ్యాచ్​లో వైభవ్​ సెంచరీ వృథా అయ్యింది. 229 పరుగుల టార్గెట్​తో బరిలో దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ మరో 9 బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది. అభిషేక్​ శర్మ, ఇషాన్​ కిషన్ మెరుపులు జట్టుకు విజయాన్ని అందించాయి. తాజా మ్యాచ్​ అనంతరం ఐపీఎల్​ పాయింట్స్​ టేబుల్​లో ఆర్​ఆర్​ని వెనక్కి నెట్టి ఎస్​ఆర్​హెచ్​ 3వ స్థానానికి చేరుకుంది.

(AFP)

Related Photos