Bank strike : సమ్మె ఎఫెక్ట్.. ఈ నెల 26 నుంచి 5 రోజులు బ్యాంకులు బంద్! ఎస్బీఐ అలర్ట్..

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. శని, ఆదివారాలతో కలిపి వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు కీలక ముందస్తు సూచనలు జారీ చేసింది.

Published on: Sept 21, 2026 11:21 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

బ్యాంకుల్లో ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి! లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘాల ఐక్య వేదిక ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
(ANI Video Grab)expand-iconView Photos in a new improved layout
Published on Sept 21, 2026 11:21 AM

బ్యాంకుల్లో ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి! లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘాల ఐక్య వేదిక ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

(ANI Video Grab)

2/6

ఈసారి ప్లాన్ చేసిన సమ్మె వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో (సోమ, మంగళ, బుధవారాలు) సమ్మె జరగనుంది. అంతకుముందు సెప్టెంబర్ 26 నాల్గొవ శనివారం కావడంతో బ్యాంకులు మూతపడతాయి. సెప్టెంబర్ 27 ఆదివారం సాధారణ సెలవు. దీనితో వరుసగా ఐదు రోజుల పాటు నేరుగా బ్యాంక్ శాఖలకు వెళ్లి చేసుకునే లావాదేవీలన్నీ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాపారవేత్తలు, అత్యవసర నగదు డిపాజిట్లు లేదా లోన్ లావాదేవీలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.
expand-iconView Photos in a new improved layout

3/6

ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లను అప్రమత్తం చేస్తూ ఇప్పటికే కీలక ప్రకటన విడుదల చేసింది. సమ్మె కాలంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు వీలుగా బ్రాంచ్ పనులను ముందే పూర్తి చేసుకోవాలని కోరింది.

4/6

బ్యాంకింగ్ రంగంలో పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్ల పరిష్కారం కోసం యూఎఫ్‌బీయూ ఈ ఆందోళన బాట పట్టింది. ఇప్పటికే సెప్టెంబర్ 11న నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. ఇప్పుడు రెండో విడతగా మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక (అపరిమిత) సమ్మె చేపడతామని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వేలాది బ్యాంకింగ్ శాఖలపై ఈ సమ్మె ప్రభావం ప్రస్పష్టంగా పడనుంది.

5/6

శాఖల నిర్వహణ నిలిచిపోయినా, డిజిటల్ సేవలను అందుబాటులో ఉంచేందుకు ఎస్బీఐ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషిన్లు ద్వారా నగదు ఉపసంహరణ, జమ చేసుకోవచ్చు. యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు అంతరాయం లేకుండా పనిచేస్తాయి. గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్ సర్వీస్ పాయింట్లు పరిమిత బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి.

6/6

సమ్మె వేళ బ్రాంచ్ సిబ్బంది ప్రత్యక్ష భాగస్వామ్యంతో కూడిన సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. చెక్కుల క్లియరింగ్ ప్రక్రియ పూర్తిగా ఆలస్యమవుతుంది. కొత్త రుణాల మంజూరు, భౌతిక పత్రాల పరిశీలన నిలిచిపోతాయి. డిమాండ్ డ్రాఫ్ట్​లు జారీ, భారీ మొత్తంలో నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్ చేయడం సాధ్యపడదు. అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉన్నవారు సెప్టెంబర్ 25 నాడే పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ అధికారులు సూచించారు. రోజువారీ లావాదేవీల కోసం వీలైనంత వరకు డిజిటల్ చెల్లింపుల మార్గాలను ఉపయోగించుకోవడం మంచిది.

Related Photos