ఫొటోలు : రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం - 71 శాతం పనులు పూర్తి!

Secunderabad Railway Station Redevelopment : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 71% పనులు పూర్తయినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. పనుల ప్రగతికి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

Published on: Nov 9, 2026 8:14 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత కీలకమైన, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.

Published on Nov 9, 2026 8:14 AM

2/7

అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్టును రూ. 714.73 కోట్ల అంచనా వ్యయంతో దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తోంది. రోజూ సుమారు 180కి పైగా రైళ్లు, దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే ఈ స్టేషన్ పనులు ఇప్పటివరకు 71 శాతం పూర్తయినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

3/7

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ప్రయాణికులకు సులభమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు పలు ప్రత్యేక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.

4/7

ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో పలు కీలక భవనాలు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.ఇందులో నూతనంగా నిర్మించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భవనం, కాజీపేట వైపు కొత్తగా ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి,

దక్షిణ భాగంలోని స్టేషన్ భవనం గ్రౌండ్ ఫ్లోర్ (ప్రయాణికుల రాకపోకల ప్రాంతాలతో సహా).

సౌత్ బేస్‌మెంట్ నిర్మాణం, స్టేషన్‌కు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన సౌత్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ (ESS) ఉన్నాయి.

5/7

మిగిలిన 29 శాతం పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు పనులను పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మరియు ఉత్తర భాగాల స్టేషన్ ప్రధాన భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ఉత్తర వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్, నార్త్ బేస్‌మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయి.

6/7

అలాగే హైదరాబాద్ వైపు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫారమ్‌లపై కవర్ ఓవర్ రూఫ్‌లు, ఎయిర్ కాన్కోర్స్, ట్రావెలెటర్లతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫారమ్ ఫ్లోరింగ్ మరియు మెట్రో కనెక్టివిటీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

7/7

మిగిలిన  పనులన్నీ పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నగరానికే ప్రధాన ఆకర్షణగా మారనుంది.

Related Photos