సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిపత్యం.. మహిళల ప్రపంచ కప్‌లో భారత్ గెలుపు ఖాయమేనా!
2025 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని గంటల్లో సౌతాఫ్రికా మహిళా జట్టుతో టీమిండియా పోటీపడనుంది. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు గెలుపునకు దోహద పడే ఐదు కారణాల గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఈ 2025 మహిళల ప్రపంచకప్‌లో నవీ ముంబై వేదికగా టీమిండియా ఇప్పటికే 3 మ్యాచ్‌లు ఆడింది. అంతేకాదు, అన్ని మ్యాచుల్లోనూ గెలిచింది! అంటే గ్రౌండ్ పరిస్థితులు మన మహిళల జట్టుకు బాగా తెలుసు. పైగా వర్షాల కారణంగా ప్రాక్టీస్ సెషన్లు కూడా సరిగ్గా జరగలేదు. ఫలితంగా గ్రౌండ్ పరిస్థితులకు సౌతాఫ్రికా జట్టు అలవాటు పడిందా లేదా చూడాలి.
వన్డేల్లో సౌతాఫ్రికాతో హెడ్-టు-హెడ్ స్టాట్స్ విషయంలో టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. 34 సందర్భాల్లో ఇరు జట్లు తలపడగా భారత మహిళల టీమ్ 20 సార్లు గెలిచింది. సౌతాఫ్రికా 13 సార్లు విజయం సాధించింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇది మనకు అడ్వాంటేజ్!
భారత మహిళల జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌లోకి రావడం మరొక ప్లస్ పాయింట్! ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ 89 పరుగలు చేసింది. జెమిమాతో కలిసి సాధించిన 167 పరుగుల చారిత్రక భాగస్వామ్యంతో హర్మన్ప్రీత్లో విశ్వాసం మరింత పెరిగి ఉంటుంది. అంతేకాదు, 36ఏళ్ల హర్మన్‌ప్రీత్‌కు ఇదే చివరి వరల్డ్ కప్ అవ్వొచ్చు. అందుకే ఇందులో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆమె రెడీ అవ్వనుంది.
మహిళల ప్రపంచకప్ ఆశాంతం టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో నెం.3 ఇబ్బంది పెట్టింది. కానీ జెమిమా కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో ఆ ఇబ్బంది కూడా తొలగిపోయింది. ఇది కూడా సానుకూల విషయమే.
వీటన్నింటికి మించిన ప్లస్ పాయింట్.. మన మహిళల జట్టుకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుండటం. డీవై పాటిల్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ప్రజలు మన జట్టుకు ఫుల్ ఎనర్జీని ఇచ్చే పనిలో ఉండటం ఖాయం!
E-Paper

