Eggs : గుడ్లు అతిగా తిన్నా ప్రమాదమే! రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

Eggs side effects : కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే గుడ్లను అతిగా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఎన్ని గుడ్లు తినాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jun 13, 2026 12:18 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

మన దైనందిన ఆహారంలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే అద్భుతమైన ఆహారం కోడిగుడ్డు! ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినే ఉడకబెట్టిన గుడ్డు దగ్గర నుంచి మధ్యాహ్నం ఆరగించే ఘుమఘుమలాడే ఎగ్ కర్రీస్, బేక్డ్ వంటకాల వరకు గుడ్డు ప్రతి ఒక్కరి మెనూలోనూ భాగమైపోయింది. ఇందులో శరీరానికి అవసరమైన అత్యున్నత నాణ్యత గల ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ డీ, విటమిన్ బీ12 వంటి ముఖ్యమైన విటమిన్లు, సెలీనియం, జింక్ వంటి ఖనిజ లవణాలు కోడిగుడ్డు ద్వారా మనకు అందుతాయి. క్రమం తప్పకుండా గుడ్లు తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. ఇది పొట్ట నిండిన అనుభూతిని ఇవ్వడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 13, 2026 12:18 PM

2/6

అయితే, ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని గుడ్లను ఎక్కువగా తినడం అస్సలు మంచిది కాదు. ఏ ఆహారమైనా అమృతం లాంటిదే అయినా.. అది హద్దులు దాటితే అనర్థాలకు దారితీస్తుంది. గుడ్లను అతిగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు ఎన్ని గుడ్లు తినాలి, వాటిని ఎలా వండుకోవాలనే సరైన అవగాహన ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

3/6

సున్నితమైన జీర్ణశక్తి ఉన్నవారిలో గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అలర్జీ సమస్యలు ఉన్నవారిలో వికారం లేదా చర్మంపై చిన్నచిన్న పొక్కులు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. కేవలం ప్రొటీన్ కోసం గుడ్లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల, శరీరానికి అందాల్సిన ఇతర పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు గుడ్లు తినేటప్పుడు ఖచ్చితంగా పరిమితి పాటించాలి. గుడ్లను వండేటప్పుడు ఎక్కువ మొత్తంలో వెన్న, చీజ్ లేదా ప్రాసెస్ చేసిన మాంసంతో కలిపి వండితే.. అందులోని సాచురేటెడ్ ఫ్యాట్ (శరీరానికి హాని చేసే కొవ్వు) శాతం పెరిగి హృద్రోగ సమస్యలకు కారణమవుతుంది.

4/6

రోజుకు ఎన్ని గుడ్లు తినడం సురక్షితం?- ఆరోగ్యంగా ఉండే వయోజనులు సమతుల్య ఆహారంలో భాగంగా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు, రోజుకు ఒక గుడ్డు చొప్పున ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

5/6

పిల్లల విషయానికి వస్తే, వారు రోజూ ఒక గుడ్డు తినవచ్చు. ఇది వారి శారీరక ఎదుగుదలకు, మేధో వికాసానికి అవసరమైన ప్రొటీన్లు, పోషకాలను అందిస్తుంది. అయితే, అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని రూపాలీ దత్తా హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు తమ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి, వైద్యుల సలహా మేరకు వారానికి కేవలం 3 గుడ్ల వరకు మాత్రమే పరిమితం కావడం ఎంతో శ్రేయస్కరం.

6/6

అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం గుడ్లు మాత్రమే కాకుండా.. ప్రొటీన్లు లభించే ఇతర ఆహార పదార్థాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అన్నింటినీ కలిపి సమతుల్య ఆహారంగా తీసుకోవడమే అసలైన రహస్యం.

Related Photos